Begin typing your search above and press return to search.
చూపు లేకున్నా.. కంటికి రెప్పలా చూసుకునే స్మార్ట్ వాచ్
By: Tupaki Desk | 4 Aug 2015 6:02 AM GMTసాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. చూసేందుకు చిన్న ఉప కరణమే అయినా.. దాని కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. చుట్టూ చూడాల్సిన అందాలు ఎన్నో ఉన్నా.. కనులారా వాటిని చూస్ అవకాశం లేని దురదృష్టవంతులకు సరికొత్త సాధనం ఒకటి తయారైంది.
కంటి చూపు లేని వారి కోసం రూపొందించిన సాంకేతికత ఏమిటంటే..అదో ప్రత్యేక స్మార్ట్ వాచ్. ప్రపంచంలో ఇప్పటికే కొన్ని స్మార్ట్ వాచ్ లు ఉన్నప్పటికీ.. ఈ స్మార్ట్ వాచ్ మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైంది. దీంతో.. కళ్లు కనిపించని అంధులకు ఎంతో సాయంగా నిలవనుంది. ఈ వాచ్ ను దక్షిణ కొరియాకు చెందిన ‘‘డాట్’’ అనే స్టార్టప్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది.
దీనికున్న టెక్నాలజీతో.. అంధులు ఈ స్మార్ట్ వాచ్ ను ధరించి చాలా పనుల్ని తమకు తాము పొంతంగంగా చేసుకునే వీలుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ తో ఛాటింగ్.. గేమ్స్.. డిజిటల్ పుస్తకాలు చదివే సౌకర్యంతో పాటు.. మ్యాప్ లో దిక్కుల్ని చూసుకునే వీలు.. లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అంధులకు వరప్రసాయిగా మారే ఈ స్మార్ట్ వాచ్ కానీ అందుబాటులోకి వస్తే.. చాలానే మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.