Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ తో క్యాన్సర్ పక్కానేనంట

By:  Tupaki Desk   |   26 July 2015 5:35 AM GMT
సెల్ ఫోన్ తో క్యాన్సర్ పక్కానేనంట
X
సెల్ ఫోన్ వాడొచ్చా? లేదా? ఆ ప్రశ్న వేసుకునే రోజులు దాటి పోయి చాలా ఏళ్లే గడిచిపోయింది. నువ్వు ఏదైనా దీవిలో ఉంటే.. నీ వెంట ఉంచుకునే మూడు ముఖ్యమైన వస్తువులు ఏమిటని.. ఫేస్ బుక్ అధిపతిని అడిగితే.. ఆయన చెప్పిన ఆ ఐదింటిలో సెల్ ఫోన్ ఒకటి (డేటా ఉండాలని.. లేదంటే పుస్తకం అని చెప్పారు) చెప్పిన సమాధానం ఒక్కటి చాలు.. మానవాళి సెల్ ఫోన్ కు ఎంత బాగా బానిస అయ్యిందో తెలుసుకోవటానికి.

అయితే.. సెల్ ఫోన్ వినియోగంతో రేడియోధార్మిక ముప్పు ఉందన్న విమర్శ ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే.. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో సెల్ ఫోన్ తో తక్కువ మోతాదులో రేడియోథార్మికత విడుదలవుతుందని.. దీని కారణంగా.. జీవ కణాలపై ప్రభావం ఎంత మేర ఉంటుందన్న విషయంపై ఒక పరిశోధన జరిపారు.

ఈ పరిశోధన చెప్పిన మాటేమిటంటే.. దీర్ఘకాలం పాటు రేడియో థార్మికతకు గురైనప్పుడు కణాల్లో అక్సీకరణకు సంబంధించిన సమస్య ఏర్పడుతుందని.. ఆ కారణంగా జీవక్రియల్లో అసమతౌల్యం ఏర్పడే వీలుందని చెప్పారు.

ఇలాంటి తక్కువ మోతాదులో ఉండే రేడియో థార్మికత (సెల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే మోతాదు) కారణంగా క్యాన్సర్.. చర్మ సంబంధిత వ్యాధులు.. నాడీ సంబంధమైన జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని తేల్చారు. అందుకే.. వీలైనంత తక్కువ మోతాదలో సెల్ వినియోగిస్తే మంచిది. సెల్ ఫోన్ వాడొద్దని చెప్పలేం. కానీ.. వినియోగించటంలో కాస్తంత పొదుపు పాటిస్తే.. అనవసరంగా కొని తెచ్చుకునే జబ్బులకు లోను కాకుండా ఉండొచ్చు.