Begin typing your search above and press return to search.
రోబోలు పని చేసే తొలి ఫ్యాక్టరీ
By: Tupaki Desk | 1 Aug 2015 9:28 AM GMTమరో యాభై ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఫ్యాక్టరీలో కార్మికులు అనే వారు ఉంటారా? వారి స్థానానికి ముప్పు కలిగే పరిస్థితి ఉంటుందా? అంటే అవుననే చెప్పొచ్చు. చైనాలో తాజాగా ఒక కంపెనీ చేపట్టిన ప్రక్రియను చూస్తే.. భవిష్యత్తులో ఫ్యాక్టరీలు ఎలా పని చేస్తాయో ఇట్టే అర్థమైపోతుంది.
ఫ్యాక్టరీ అన్న వెంటనే బోలెడంత మంది కార్మికులు.. హడావుడి.. చాలానే ఉంటుంది.కానీ.. అదేమీ లేకుండా రోబోలు తమ పని తాము చేసుకోవటం కుదురుతుందా? అంటే.. చైనాలోని డాంగ్వాన్ పట్టణంలో ఉన్న చాంగ్ యింగ్ ప్రిసిషియన్ టెక్నాలజీ అనే కంపెనీకి చెందిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలి. ఆ కంపెనీలు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా రోబోలు ఆవిశ్రాంతంగా పని చేస్తూనే ఉంటాయి. ఇలాంటి రోబోలు ఇప్పుడు ఆ కంపెనీలో 60 వరకూ ఉన్నాయి.
రానున్న రోజుల్లో వీటి సంఖ్యను వెయ్యికి పెంచుతామని.. అది కూడా రెండేళ్లలోనేనని సదరు కంపెనీ ప్రెసిడెంట్ చెబుతున్నాడు. ప్రస్తుతం 60 రోబోల్ని చూసుకునేందుకు 60 మంది.. వాటి పని నాణ్యతను పరిశీలించుంకు ముగ్గురు చూస్తున్నారు. ఇక.. 60 మందికి 20 మందిని తగ్గిస్తామని.. ఈ రోబోలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి.. ఒక్కో రోబో చేయి ఎనిమిదిమంది కార్మికులు చేసే పనిని అలవోకగా చేసేస్తుందని చెబుతున్నారు.
అంతేకాదు.. రోబోల పుణ్యమా అని ఉత్పత్తి బాగా పెరిగిందట. గతంతో పోలిస్తే.. రోబోలతో పని చేయించటం మొదలు పెట్టాక రోజుకు అదనంగా ఎనిమిది వేల వస్తువుల ఉత్పత్తి పెరిగిందని చెబుతున్నారు. ఇంతకీ ఈ కంపెనీ తయారు చేసేదేమంటే.. సెల్ ఫోన్ల మాడ్యూల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా కంపెనీలన్నీ మనుషుల స్థానే యంత్రాల మీద ఆధారపడితే.. పెరిగే జనాభాకు ఉపాధి సంగతి ఏమవుతుందో కదూ..?