Begin typing your search above and press return to search.

ఫ్రీ అని ఆశ పడితే ఉన్నది పోతుందా?

By:  Tupaki Desk   |   2 Aug 2015 4:53 AM GMT
ఫ్రీ అని ఆశ పడితే ఉన్నది పోతుందా?
X
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 ఓఎస్ విషయంలో తాజా భయం ఒకటి మొదలైంది. 190 దేశాల్లో విడుదల చేసిన ఈ సాఫ్ట్ వేర్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకోవటానికి మైక్రోసాఫ్ట్ అవకాశం ఇచ్చింది. దీనికి భారీ ఎత్తున ప్రజాదరణ వ్యక్తమవుతోంది కూడా. ఫ్రీ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆన్ లైన్ క్యూలో ఉండాల్సిన పరిస్థితి.

దీన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త వైరస్ దాడులు జరుగుతున్నట్లుగా గుర్తించారు. కొందరు మోసగాళ్లు.. విండోస్ 10 ఫ్రీ డౌన్ లోన్ ఆప్షన్ ను పక్కదారి పట్టిస్తూ.. వైరస్ దాడులకు పాల్పడుతున్నట్లుగా ప్రముఖ నెట్ వర్క్ పరికరాల తయారీ.. డిజైనింగ్ సంస్థ సిస్కో వార్నింగ్ ఇస్తోంది.

మైక్రోసాప్ట్ లోగోతో కూడిన మొయిల్ ను పంపుతుందని.. ఇలాంటి మొయిల్స్ ను ఓపెన్ చేస్తే.. ప్రమాదకరమైన వైరస్ సిస్టంలో చేరిపోతుందని.. అన్ని ఫైల్స్ కు మాల్ వేర్ లాక్స్ పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు. దీని కారణంగా సిస్టంతో పాటు.. ప్రింటర్.. స్కానర్ లాంటివి కూడా పని చేయవని చెబుతున్నారు.ఇలా జరిగిన కొన్ని గంటల తర్వాత.. కొంత మొత్తం చెల్లిస్తే.. మాల్ వేర్ పోతుందంటూ బేరాలకు దిగుతారని.. అందుకే.. ఫ్రీ డౌన్ లోడ్ అన్న మొయిల్స్ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని పిస్కో పేర్కొంటోంది. ఫ్రీ డౌన్ లోడ్ అని టెంప్ట్ అయ్యే కన్నా.. కాస్త ఆగితే బెటర్. మరి.. ఫ్రీ విషయం కాస్తంత పారాహుషార్ సుమి.