Begin typing your search above and press return to search.
ఇంటర్నెట్ లేకున్నా ఛాటింగ్ చాలా ఈజీ
By: Tupaki Desk | 7 Aug 2015 10:08 AM GMTవినేందుకు విడ్డూరంగా ఉన్నా టెక్నాలజీ అందిస్తున్న సరికొత్త సదుపాయంగా దీన్ని చెప్పొచ్చు. చాటింగ్ చేయాలంటే నెట్ కనెక్షన్ తప్పనిసరి. అదే మొబైల్ లో అయితే.. డేటా ప్లాన్ ఉండాల్సిందే. కుదరదంటే వైఫై ఉన్నా పని అయిపోయిద్ది. కానీ.. ఇంటర్నెట్ అన్నది లేకుండా చాట్ చేసే అవకాశాన్ని ఇస్తోంది ఫైర్ చాట్.
మొబైల్ డేటా ప్లాన్ లేకున్నా.. వైఫై సౌకర్యం లేని చోట కూడా చాట్ చేసుకునే సౌకర్యం ఫైర్ చాట్ యాప్ ఇస్తోంది.వాస్తవానికి ఈ యాప్ గతంలో ఉన్పప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండేవి. వాటిని పరిష్కరించి సరికొత్తగా ముందుకు తీసుకొచ్చారు. ఓపెన్ గార్డెన్ అనే సంస్థ నుంచి వచ్చిన ఫైర్ చాట్ యాప్ కానీ మొబైల్ లో ఉంటే చాటింగ్ కు ఢోకా ఉండదని చెబుతున్నారు.
ఇంటర్నెట్ అన్నది లేకుండా చాట్ చేయటం సాధ్యమేనా? దీనిక టెక్నాలజీ ఏమిటన్న మాటకు ఈ కంపెనీ ఇస్తున్న వివరణ ఏమిటంటే.. తాము మెష్ టెక్నాలజీ వినియోగించామని.. దీంతో.. ఇంటర్నెట్ లేకున్నా చాట్ చేసే వీలుందని చెబుతున్నారు. కాకపోతే.. దీన్ని వినియోగించే సమయంలో బ్లూటూత్.. వైఫై సిగ్నల్ ని ఆన్ (వైఫై అందుబాటులో లేకున్నా పర్లేదు. ఆ ఫీచర్ ను యాక్టివ్ లో ఉంచితే సరిపోతుంది) చేసి ఉంచాలని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే ఈ యాప్ ను వినియోగించుకునే వీలు ఉంటుంది.
అండ్రాయిడ్.. ఐవోఎస్ లలో అందుబాటులో ఉన్న ఈ యాప్ విడి సమయాల్లోనే కాదు.. ఏదైనా ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు కానీ.. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్న సందర్భాల్లో దీన్ని ఉపయోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు.