Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకున్న రోబోలు

By:  Tupaki Desk   |   30 Jun 2015 6:18 AM GMT
పెళ్లి చేసుకున్న రోబోలు
X
మనుషులు చేసే ప్రతి పనిని చేసేలా సరికొత్త తరం రోబోలు ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి రావటం తెలిసిందే. అసలుసిసలు మనిషి మాదిరి హావభావాలు పలికించే రోబోలతో పాటు.. రిసెప్షెనిస్ట్‌ రోబో.. మోడల్‌ రోబో.. సేల్స్‌ పర్సన్‌ రోబో.. ఇలా చాలానే రోబోలను తయారు చేయటం తెలిసిందే.

దూరం నుంచి చూస్తే నిజంగానే మనిషి అన్నట్లుగా ఉంటున్న ఈ రోబో (హ్యూమనాయిడ్‌)లు వ్యవహరిస్తున్నాయి. ఇలాంటివాటిని తయారు చేసిన రెండు కంపెనీల రోబోలు తాజాగా పెళ్లి చేశారు. జపాన్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం అద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేసే.. మయవా డేంకీ.. టకయుకి టోడో కంపెనీలు తమ తమ హ్యూమనాయిడ్‌ రోబోలకు పెళ్లి చేశారు. మయవా డేంకీ అనే కంపెనీ వరుడు ఫ్రోయిన్‌ రూపొందిస్తే.. వధువు యుకిరిన్‌ను టకయుకి టోడో కంపెనీ రూపొందించింది. ఇక.. ఈ పెళ్లిలో విశేషం ఏమిటంటే.. అర్కెస్ట్రా నుంచి అన్ని విషయాల్ని రోబోలే పర్యవేక్షించటం.

ఇక.. రోబో అంటే ఇనుప ముద్దలా కాకుండా.. పెళ్లి డ్రెస్‌గా తెల్లటి గౌను ధరించి వచ్చిన రోబో యుకిరిన్‌ను దూరం నుంచి చూసిన వారంతా నిజంగా అసలుసిసలు పెళ్లికూతురుగా అనుకున్నారట. ఇక.. పెళ్లి పూర్తి అయినా తర్వాత ఈ దంపతుల రోబోలు కలిసి కేక్‌ కట్‌ చేయటం లాంటి కార్యక్రమాలు చేసి.. పలువురిని ఆకర్షించారట. ఇదంతా వింటుంటే.. టెక్నాలజీ పుణ్యమా అని మనం ఎక్కడికో వెళ్లిపోతున్నట్లు అనిపించటం లేదు..?