Begin typing your search above and press return to search.
అంతరిక్ష ఇంటర్నెట్ వచ్చేసింది
By: Tupaki Desk | 21 Jun 2015 11:26 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ అన్న మాట వినని వారు చాలా తక్కువ మందే. గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా వ్యాపించటమే కాదు.. పొలాలకు టాబ్లెట్లు తీసుకెళ్లి ఫేస్ బుక్ లు చూసుకుంటున్న పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి.
మనం ఇంతలా ఇంటర్నెట్ తో అనుసంధానం అవుతుంటే.. మరోవైపు ప్రపంచంలోని మూడొంతుల మందికి ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాని పరిస్థితి.ప్రపంచంలోని దాదాపు 300 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు.. వారిని ఇంటర్నెట్ తో అనుసంధానం చేసేందుకు ప్రపంచంలోనే భారీ కంపెనీలు రంగంలోకి దిగాయి.
స్పేస్ ఎక్స్.. గూగుల్..ఫేస్ బుక్ లాంటి కంపెనీలు అంతరిక్ష ఇంటర్నెట్ అన్న కాన్సెప్ట్ లోకి దిగాయి. అంటే.. ఇంటర్నెట్ సేవల కోసం ప్రస్తుతం నెట్ వర్క్ లేని వారు నేరుగా అంతరిక్షంలోని ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిపోయే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీని ద్వారా.. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న 300 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందే వీలుంది.
అంతరిక్ష ఇంటర్నెట్ కోసం దాదాపు 12 ఉపగ్రహాల్ని వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఓ3బీ నెట్‌వర్క్స్ అనే కంపెనీ అంతరిక్ష ఇంటర్నెట్ సేవల్ని స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోని లేని 300 కోట్ల మందికి సేవలు అందించటమే లక్ష్యం.
మిగిలిన ఇంటర్నెట్ నెట్ వర్క్ మాదిరే అంతరిక్ష ఇంటర్నెట్ కూడా వేగంగా ఉండటమేకాదు.. మామూలు ఇంటర్నెట్ కంటే తక్కువ ఖర్చుతో సేవలు అందించే వీలుంది. గూగుల్.. హెచ్ ఎస్ బీసీ వంటి కంపెనీల ఆర్థిక సహకారంతో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ శాటిలైట్ నెట్ వర్క్ ద్వారా భూగోళంపై 70శాతం కవర్ కానున్నాయి. ఈ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు 8 ఉపగ్రహాల్ని పంపనున్నారు. ఇందుకోసం పెద్దఎత్తున కంపెనీలతో ఓ3బీ నెట్‌వర్క్స్ సంస్థ ఒప్పందాలు చేసుకుంది. ఈ అంతరిక్ష ఇంటర్నెట్ ప్రత్యేకత ఏమిటంటే.. వ్యక్తిగత అవసరాలకు.. వాణిజ్య సంస్థల అవసరాలకు తగినట్లుగా వేర్వేరుగా సేవలు అందిస్తున్నారు.