Begin typing your search above and press return to search.
50 ఏళ్ల తర్వాత?; రోబోలతో మనిషి శృంగారం
By: Tupaki Desk | 7 Aug 2015 9:45 AM GMTగడిచిపోయిన రోజులే మంచివని ఊరికే అనలేదేమో. కాలం గడుస్తున్న కొద్దీ.. సాంకేతకంగా మరింత ముందుకు దూసుకెళుతున్నకొద్దీ మనిషి యంత్రం మీద మరింత మోజు పెరగటం.. దాని సేవలకు బానిస కావటం తెలిసిందే. యంత్రుడు మనిషికి మించనప్పటికీ.. తనకు లోబర్చుకోవటంలో యంత్రుడు సక్సెస్ కావటం తెలిసిందే.
రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో పాటు.. మారిన జీవనశైలి పుణ్యమా అని ఇప్పటికే ఎన్నో చిత్ర విచిత్రమైన పరిస్థితుల్ని చూస్తున్నాం. గతంలో ఒకే మతం.. ఒకే వర్గం వారిని పెళ్లాడకపోవటమే పెద్ద వింతగా ఉండేది. ఆ తర్వాత ప్రకృతికి విరుద్ధంగా సజాతుల మధ్య అనుబంధాల్ని చూస్తున్న పరిస్థితి. ఇలాంటి వైఖరుల్ని సంప్రదాయవాదులు మండిపడుతుంటే.. ప్రభుత్వాలు సైతం అండగా నిలుస్తున్న పరిస్థితి.
మగాడు.. మరో మగాడ్ని పెళ్లి చేసుకొని జీవించటం..ఒక ఆడది మరో ఆడదాన్ని వివాహం చేసుకొని దాంపత్య అనుబంధాన్ని సాగిస్తామని పబ్లిక్ గా చెప్పుకోవటం ఇప్పుడు మామూలే. ఇప్పుడే ఇలా ఉంటే.. 50 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కాస్తంత ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి ఊహించని రీతిలో సమాధానం ఇస్తున్నారు హెలిన్ డ్రిస్కాల్ అనే పరిశోధన వేత్త.
మనుషుల అనుబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయన్న అంశంపై పరిశోధన చేస్తున్న ఆయన కాస్తంత షాక్ కలిగే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు.. తరిగిపోయే అనుబంధాలు.. పెరిగిపోయే అపనమ్మకాల పుణ్యమా అని అభిరుచులకు తగ్గట్లుగా భాగస్వామ్యులు దొరకని పరిస్థితి వస్తుందట.
దీంతో.. మనుషులకు బదులుగా యంత్రం (రోబో)లను మనిషి తన భాగస్వామిగా చేసుకునే వీలుందని చెబుతున్నారు. లైంగిక ఆనందం కోసం రోబోలతో శృంగారం 50 ఏళ్లు.. లేదంటే మరికాస్త ముందు తర్వాత కామన్ కావొచ్చని చెబుతున్నారు. వినటానికే విచిత్రంగా ఉన్న ఈ అంశం ఎంతవరకు నిజం అవుతుందో కానీ.. అలాంటి కాలం వరకూ ఉండకపోతే బాగుండని మాత్రం అనిపించట్లేదు..?