Begin typing your search above and press return to search.
వచ్చేసింది.. విండోస్ 10
By: Tupaki Desk | 29 July 2015 4:20 AMప్రపంచంలో అత్యదిక కంప్యూటర్లు పని చేసే విండోస్ ఓఎస్ కొత్త వెర్షన్.. చివరిది (ఇకపై విండోస్ కొత్త వెర్షన్ విడుదల ఉండదని.. ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ మాత్రమే ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది) అయిన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 మార్కెట్ లోకి వచ్చేసింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. విడుదలైంది.
ఇప్పటికే విండోస్ వినియోగిస్తున్న వినియోగదారులు. తమ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే.. ముందస్తుగా అనుమతి కోరి ఉంటే.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి అప్ గ్రేడ్ కు అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకూ అప్ గ్రేడ్ కోసం 50 లక్షల మంది నమోదు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఆదరణ కాస్త తగ్గుముఖం పట్టి.. ప్రపంచం ఆండ్రాయిడ్ వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో.. తాజా విండోస్ 10 ఏ మేరకు ఆకర్షిస్తోందనన్నది ఆసక్తికరంగా మారింది. విండోస్ 10 వెర్షన్ ను మొదట డెస్క్ టాప్.. ల్యాప్ టాప్ మీద వినియోగించే వీలుంది. అనంతరం ఫోన్లు.. గేమ్ కన్సోళ్లు.. హాలోగ్రాఫిక్ హెడ్ సెట్లలోనూ దీన్ని వినియోగించుకునేలా రూపొందించారు. తొలిరోజే విండోస్ అందరికి అందుబాటులోకి రాకపోవచ్చని..త్వరిత గతిన దీన్ని అందుబాటులోకి తెస్తామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న మూడేళ్లలో వందకోట్ల కంప్యూటర్లలో విండోస్10 ఉండాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా చెబుతున్నారు. మరి.. అండ్రాయిడ్ విసురుతున్న సవాలుకు.. విండోస్ 10 ఎంతమేరకు సమాధానం ఇస్తుందో చూడాలి.