బండి కీలక వ్యాఖ్యలపై విశ్లేషకుల వెర్షన్ ఇది?
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.. సొంత పార్టీలోని తన వ్యతిరేక వర్గీయుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 July 2023 4:50 AM GMTతెలంగాణ బీజేపీ లో అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి, ఆ స్థానం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయని అంటున్నారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.. సొంత పార్టీలోని తన వ్యతిరేక వర్గీయుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ నాయకత్వానికి తన పై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. అనంతరం.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారం లోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
అవును... తన మీద కొందరు పార్టీ పెద్దలకు తప్పుడుగా ఫిర్యాదులు చేశారని.. దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయడం, తప్పుడు రిపోర్టులు ఇవ్వడం బంద్ చేయండని.. నమ్ముకుని వచ్చిన నాయకుల ను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల ఆశల ను వమ్ము చేయకండని.. కిషన్ రెడ్డి సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి, ఆయననైనా ప్రశాంతంగా పనిచేయనివ్వండి.. అని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... కేసీఆర్ పైనా సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్షాలతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఫాంహౌస్ లో పడుకొని తమాషా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్.. పులిచారలు కప్పుకొన్న గుంటనక్క అని, ఎంఐఎం కోసం మైనారిటీల కు రూ.లక్ష సాయం పేరుతో మోసం చేయాల ని చూస్తున్నారని అన్నారు.
ఇదే సమయం లో... రాష్ట్రంలో బీజేపీ ని ఈస్థాయికి తీసుకురావడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని సంజయ్ చెప్పుకున్నారు. ఇదంతా కార్యకర్తల త్యాగాలు, పోరాటాల వల్లే సాధ్యమైందన్నారు. మహిళా కార్యకర్తలు, ప్రజా సంగ్రామ కార్యకర్తల పోరాటం, తెగువ గొప్పవని చెప్పుకున్నారు. ఇదే క్రమంలో తన పాదయాత్రని పరోక్షంగా ప్రస్థావించారు సంజయ్.
మరోవైపు తెలంగాణ లో బీజేపీ ఈ స్థాయిలో పెరుగుదలకు పరోక్షంగా కేసీఆర్ కారణం అనే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. బీఆరెస్స్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు తెలంగాణ ప్రజల్లోకి పంపే పనుల కు పూనుకున్నది కేసీఆర్ అనేది వారి అభిప్రాయం
అందుకు కారణం... తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడయిన తర్వాత... కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మానేశారని, తనకున్న ప్రత్యేక బలంతో మీడియాలో కవరేజిని సైతం కట్టడిచేయగలిగారని కామెంట్స్ చేస్తున్నారు.
ఫలితంగా... బీజేపీ ఓటు బ్యాంకు ను పరోక్షంగా పెంచేపనికి పూనుకున్నారని పలువురు అభిప్రాయపడుతుంటారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలే ఛాన్స్ ఉందని.. అది ఫైనల్ గా అధికార బీఆరెస్స్ కు ప్లస్ అవుతుందని భావించారని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
ఆ విషయం గ్రహించని బండి సంజయ్... అదంతా తన క్రెడిట్టే అని ఫీలవుతుంటారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. ఏది ఏమైనా... తెలంగాణ బీజేపీ లో అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తి పూజలు, సెల్ఫ్ డబ్బాలు పోవాల ని... అంతా కలిసి ఐకమత్యంగా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని... టి.బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారని తెలుస్తుంది.