Begin typing your search above and press return to search.

వార్ రూం..సక్సెస్ అవుతుందా ?

ఎన్నికల్లో గెలుపునకు పార్టీ అగ్రనేతలు ఏర్పాటుచేసిన 22 కమిటీలకు వార్ రూమే దిశానిర్దేశం చేస్తుంది.

By:  Tupaki Desk   |   27 July 2023 5:10 AM GMT
వార్ రూం..సక్సెస్ అవుతుందా ?
X

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అబిడ్స్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వార్ రూమ్ ఏర్పాటైంది. ఎన్నికల్లో గెలుపునకు పార్టీ అగ్రనేతలు ఏర్పాటుచేసిన 22 కమిటీలకు వార్ రూమే దిశానిర్దేశం చేస్తుంది.

ఈ మొత్తానికి బీజేపీ ఉత్తరాధి ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం ఇన్చార్జిగా ఉంటారు. ఇందులోనే మీడియా స్ట్రాటజీ టీమును కూడా ఏర్పాటు చేసింది. ఈ టీముకు జాతీయ కార్యదర్శి శ్వేతా శాలిని ఇన్చార్జిగా ఉంటారు.

ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎంఎల్ఏ రఘునందనరావు, సీనియర్ నేత యోగానంద్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. పార్టీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించారు. ఈనెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చేలోగా నేతలంతా తమకు అప్పగించిన బాధ్యతలను తీసుకోవాలని పార్టీ ఆదేశించింది.

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమిటీలన్నీ కష్టపడి పనిచేయాలని, నియోజకవర్గాల్లో నేతలు, అభ్యర్ధులందరినీ బాగా యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత ఈ కమిటీలదే అని అగ్రనేతలు స్పష్టంగా చెప్పారు.

అంటే 119 నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ సమస్తం పార్టీ ఆఫీసులోని వార్ రూమే పర్యవేక్షించేట్లుగా ఉంది చూస్తుంటే. పార్టీ ప్రచారంలో డైరెక్టుగా మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవటం ఒక ఎత్తయితే సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మరోఎత్తు. అందుకనే బీహార్ కు చెందిన శ్వేతను నియమించారు.

ఈమె ఇపుడు మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సలహాదారుగా పనిచేస్తున్నారు. 2013-14లో గుజరాత్ లో మోడీ గెలుపు కోసం శ్వేత బాగా పనిచేశారట. అందుకే అక్కడి నుండి మహారాష్ట్రకు తర్వాత ఇపుడు తెలంగాణాకు తీసుకొస్తున్నారు.

మొత్తం మీద సోషల్ మీడియాలో మొదటి నుంచి బీజేపీకి బాగా పట్టుంది. ఎందుకనో కర్ణాటక ఎన్నికల్లో బాగా వీకైపోయింది. దాని ఫలితం కూడా అనుభవించింది. అందుకనే ఆ పరిస్థితి రిపీట్ కాకూడదనే శ్వేతను తెలంగాణాకు ఇన్చార్జిగా నియమించింది. మరిక్కడ ఫలితం ఎలాగుంటుందో చూడాలసిందే.