Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి భలే కష్టం వచ్చిపడిందే !

డచిన రెండు ఎన్నికల్లో మైనారిటీలకు కేసీయార్ ఇచ్చింది రెండే సీట్లు. ఒకళ్ళేమో మహ్మూద్, రెండే నేతేమో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంఎల్ఏ షకీల్.

By:  Tupaki Desk   |   28 July 2023 7:24 AM GMT
కేసీఆర్ కి భలే కష్టం వచ్చిపడిందే !
X

అధికార బీఆర్ఎస్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటోంది. రాబోయే ఎన్నికల్లో మైనారిటి నేతలకు ఓ నాలుగు టికెట్లు ఇవ్వాలని కేసీయార్ అనుకున్నారట. అందుకని బలమైన నేతల కోసం అన్వేషిస్తున్నారట. విచిత్రం ఏమిటంటే రెండుసార్లు వరుసగా అదికారంలోనే ఉన్నా పార్టీలో చెప్పుకోదగ్గ మైనారిటి లీడర్లు మాత్రం లేరు. పార్టీలో చెప్పుకోదగ్గ మైనారిటి లీడర్ ఎవరంటే మహ్మూద్ ఆలీ మాత్రమే. మహ్మూద్ ఆలీ ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు.

అలాంటిది మరో నలుగురికి టికెట్లు ఇవ్వాలని కేసీయార్ అనుకున్నా అంత గట్టి నేతలు పార్టీలో లేకపోవటమే విచిత్రం. పార్టీలో ఎందుకు మైనారిటి లీడర్లు దొరకటంలేదు ? ఎందుకంటే మైనారిటీల కోసం మొదటినుండి ఎంఐఎం మీదే ఆధారపడ్డారు కేసీయార్.

అందుకనే పార్టీ జనాల నుండి మామూలు జనాలు కూడా బీఆర్ఎస్-ఎంఐఎం వేర్వేరు కాదనే అనుకుంటుంటారు. ఇపుడదే కేసీయార్ కు పెద్ద సమస్యగా మారింది. గడచిన రెండు ఎన్నికల్లో మైనారిటీలకు కేసీయార్ ఇచ్చింది రెండే సీట్లు. ఒకళ్ళేమో మహ్మూద్, రెండే నేతేమో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంఎల్ఏ షకీల్.

షకీల్ రెండు సార్లు గెలిచినా పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. కారణం మళ్ళీ ఎంఐఎం అనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు కేసీయార్ కు సమాచారం అందిందట.

దాంతో అప్రమత్తమైన గులాబీ బాస్ వెంటనే పార్టీలో గట్టి మైనారిటి నేతలు ఎవరున్నారనే విషయాన్ని అన్వేషిస్తున్నారట. ఎందుకంటే కనీసం నాలుగు టికెట్లిస్తే కానీ మైనారిటీలకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకునేందుకు లేదన్నది కేసీయార్ బాధ.

ఇంతర్జంటుగా మైనారిటీల్లో గట్టినేత దొరకాలంటే ఎక్కడ దొరుకుతారు ? ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఉండి మైనారిటీ నేతలను బీఆర్ఎస్ బలోపేతం చేసుకోలేకపోయిందంటే అది కచ్చితంగా కేసీయార్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎంతసేపు ఎన్నికల్లో అప్పటికప్పుడు లబ్ది దొరికితే చాలు అనే తత్వమే కేసీయార్ ను ఇపుడు ఇరుకునపెట్టబోతోంది. కాంగ్రెస్ లో మైనార్టీ నేతలు చాలామందే ఉన్నారు. సుమారు 15 మంది వరకు గట్టి నేతలున్నారు. అందుకనే హస్తం పార్టీ మైనారిటీల విషయంలో చాలా కూల్ గా ఉంది.