Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లగ్జరీ కార్ ఓనర్లకు కొత్త టెన్షన్... లక్షల బిల్లేస్తున్న వరుణుడు!

అవును... జూబ్లీహిల్స్‌లోని జగన్నాథ దేవాలయం దాటిన తర్వాత యూ టర్న్‌ తీసుకునేందుకు ప్రయత్నించగా నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌ లో చిక్కుకుపోయినట్లు

By:  Tupaki Desk   |   22 July 2023 2:42 PM GMT
హైదరాబాద్ లగ్జరీ కార్  ఓనర్లకు  కొత్త టెన్షన్... లక్షల బిల్లేస్తున్న వరుణుడు!
X

హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లపై తీవ్ర వరదలు ఏర్పడి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దీంతో... నగరంలోని కార్ల యజమానులు.. మరి ముఖ్యంగా లగ్జరీ కార్ల యజమానులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఆ కార్లకు బీమా ఉన్నప్పటికీ... వారి కార్లు నీటిలో మునిగిపోవడంతో భారీ బిల్లులు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు.

ఈ సమయంలో నగరంలోని కార్ సర్వీస్ స్టేషన్ల బయటక పొడవైన క్యూలో పార్క్ చేసిన వాహనాల్లో రూ.75 లక్షలకు పైగా విలువైన లగ్జరీ వాహనాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా.... ఇటీవల తన బీఎండబ్ల్యూ సిరీస్ 3 గ్రాన్ లిమోసిన్ కారు అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు రూ. 15 లక్షలు చెల్లించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అవును... జూబ్లీహిల్స్‌లోని జగన్నాథ దేవాలయం దాటిన తర్వాత యూ టర్న్‌ తీసుకునేందుకు ప్రయత్నించగా నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌ లో చిక్కుకుపోయినట్లు ఆ కారు యజమాని చెబుతున్నారట. ఆ సమయంలో చాలా సమయం తర్వాత ట్రాఫిక్ మళ్లీ కదలడం ప్రారంభించిన తర్వాత, అతను నీటి గుండా వెళ్ళడానికి ప్రయత్నించాడట.

కానీ ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయిందని చెబుతున్నాడు. అయితే అప్పటికి కారు న్యూట్రల్ లో ఉండటంతో దానిని కొద్దిగా నెట్టగలిగాడట. ఈ క్రమంలో అది ఆగిపోయి పార్కింగ్ మోడ్‌ లోకి వెళ్లిందట. ప్రస్తుతం వరుణుడి ప్రభావంతో... హైదరబాద్ లో చాలా మంది లగ్జరీ కార్ల ఓనర్ల పరిస్థితి ఇలా ఉందని తెలుస్తుంది.

ఈ సమయంలో బీఎండబ్ల్యూ రోడ్‌ సైడ్ అసిస్టెన్స్ వచ్చి కారును సర్వీస్ సెంటర్‌ కి తీసుకెళ్లారంట. ఈ సమయంలో "హైడ్రోస్టాటిక్ లాక్" అని రాసి ఉన్న స్టిక్కర్‌ లతో ఉన్న మరో 10 కార్లను అతను ఆ సర్వీస్ సెంటర్ ముందు ఆగి ఉండటం చూశాడని చెబుతున్నాడంట.

దీంతో హైదరాబాద్ లో లగ్జరీ కార్ ఓనర్లను వరుణుడు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఒకరంటే... అందుకు కారణం వరుణుడు కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని మరికొందరు స్పష్టం చేస్తున్నారంట. అయితే ఈ విషయాలపై కేటీఆర్ ట్విట్టర్ లో ఏమని స్పందిస్తారనేది వేచి చూడాలి!