సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేత ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు తాత్కలికంగా విరామం ప్రకటించాయి.
By: Tupaki Desk | 15 May 2024 6:19 AM GMTతెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు తాత్కలికంగా విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి రెండు వారాల పాటు ఎలాంటి షోలు వేయకూడదని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్నికలు , ఐపీఎల్ సీజన్ , అధిక ఉష్ణోగ్రతలు నమోద్వడంతో పాటు అగ్ర ఈరోల సినిమాల రిలీజ్ లు కూడా పెద్దగా లేకపోవడంతో జనాలు థియేటర్లు వైపు కు చూడటం లేదు. రోజు రోజుకి థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోతుంది.
నగరాలతో పోలిస్తే పట్టణాలు, మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో తెలంగాణ థియేటర్ అసోసియేషన్ తాత్కాలికంగా మూస్తున్నట్లు తెలిపింది. దీంతో సింగిల్ స్క్రీన్ అందుబాటులో ఉన్న ప్రేక్షకులంతా రెండు వారాల పాటు స్మార్ట్ ఫోన్ లోనూ..ఓటీటీలోనే సినిమాలు చూసుకోవాల్సి ఉంటుంది. సిటీల్లో మాత్రం మల్టీప్లెక్స్ లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఉన్నసినిమాలతో ఆడియన్స్ అడ్జస్ట్ అవ్వాల్సిందే.
ఎంత స్టార్ హీరో సినిమా అయినా వారం రోజుల పాటే థియేటర్లు కళకళలాడేవి. ఆ తర్వాత ఖాళీ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందులా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ లేరు. ఓటీటీలకు చాలా మంది అలవాటు పడటంతో ఇలాంటి పరిస్థితి కి మరో కారణంగా చెప్పొచ్చు. పైగా రిలీజ్ అవ్వాల్సిన అగ్ర హీరోల సినిమాలు కొన్ని ఎన్నికలు కారణంగా వాయిదా వేసారు. వాస్తవానికి `కల్కి 2898`...`డబుల్ ఇస్మార్ట్` లాంటి సినిమాలు ఈనెలలోనే రిలీజ్ అవ్వాలి.
కానీ ఏపీలో ఎన్నికలతో పాటు తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల హడావుడి ఉండటంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ క్లోజింగ్ అన్నది తెలంగాణలోనే ఉంది. ఏపీలో కూడా సింగిల్ స్క్రీన్ తాత్కాలికంగా మూసేస్తారా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. ఇప్పటికే నాలుగు షోలు వేయాల్సిన థియేటర్లు రెండు షోలే వేస్తున్నాయి. మరికొంత మంది రాత్రి షోలు వేస్తున్నారు. జూన్ లో మళ్లీ రిలీజ్ లు ఉన్నాయి కాబట్టి థియేటర్లు మళ్లీ అప్పుడు ఓపెన్ కానున్నాయి.