Begin typing your search above and press return to search.

జగన్ కోసం చెట్లను బలిచేస్తున్న అధికారులు.. కొన్ని చోట్లే ఎందుకిలా?

ఈ నెల 21న వైఎస్సార్‌ నేత‌న్న నేస్తం పథకానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ తిరుప‌తి జిల్లాలోని వెంక‌ట‌గిరిలో ప‌ర్యటించ‌నున్నారు

By:  Tupaki Desk   |   20 July 2023 8:17 AM GMT
జగన్ కోసం చెట్లను బలిచేస్తున్న అధికారులు.. కొన్ని చోట్లే ఎందుకిలా?
X

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా ఆల్ మొస్ట్ రాష్ట్రం మొత్తం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ అనంతరం జిల్లాల పర్యటనలు చేస్తున్నారు జగన్. ఈ క్రమంలో... జగన్ జిల్లాల పర్యట పర్యావరణానికి సంకటంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ జిల్లా ప‌ర్యట‌న‌ల‌కు వెళ్తున్నారంటే.. ఆయన పర్యటించే ప్రాంతంలోని రోడ్లపక్కన ఉన్న చెట్లను తొలగించేస్తున్నారు అధికారులు. సెక్యూరిటీ పరంగా ఆలోచించి చేస్తున్నారో ఏమో తెలియదు కానీ... జగన్ పర్యటించే ఆ ప్రాంతంలోని చెట్లను మాత్రం నిర్ధాక్షినీయంగా తొలగించేస్తున్నారు. ఫలితంగా విమర్శల పాలవుతున్నారు.

ఇందులో భాగంగా తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో అదేపనికి పూనుకున్నారు అధికారులు. ఈ నెల 21న వైఎస్సార్‌ నేత‌న్న నేస్తం పథకానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ తిరుప‌తి జిల్లాలోని వెంక‌ట‌గిరిలో ప‌ర్యటించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌ట‌గిరిలో య‌ధాప్రకారం చెట్ల న‌రికివేత జ‌రిగిందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... వెంక‌ట‌గిరిలోని త్రిభువ‌ని కూడ‌లి ప్రాంతంలో చెట్లను పూర్తిగా తొల‌గించారట అధికారులు. అయితే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్లా జరగడం లేదని తెలుస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుందనేది తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు.

ఉదాహరణకు గతనెలలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారిడి పెళ్లికి హారయ్యారు జగన్. ఈ సందర్భంగా హెలీకాప్టర్ లో వచ్చిన జగన్... మలికిపురం లోని కొబ్బరి తోటల పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగారు. అక్కడ నుంచి ఇరుపక్కలా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉండే కోనసీమ రోడ్లపై చాలా దూరం ప్రయాణించి వివాహ వేదికకు చేరుకున్నారు.

నాడు రాజోలు నియోజకవర్గంలో జగన్ వాహనాల్లో పర్యటించిన రోడ్ల వద్ద, కూడళ్ల దగ్గరా ఎక్కడ ఎలాంటి చెట్టునూ నరకలేదు. ఆ దిశగా అధికారులు ఎవరూ ఆలోచన చేయలేదు. అలాంటి పనీ చేయలేదు. కానీ.. కొన్ని నియోజకవర్గాలకు వెళ్తున్న క్రమంలో మాత్రం అధికారులు ఇలా చెట్లను తొలగిస్తూ... పర్యావరణ ప్రేమికుల విమర్శలపాలవుతున్నారు.