ఫేస్ బుక్ పరిచయం.. ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇండియన్!
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ప్రేమలు
By: Tupaki Desk | 24 July 2023 5:05 AM GMTఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ప్రేమలు, అనంతర మోహాలూ పెరిగిపోతున్నాయనే వార్తలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇప్పటికే ఇండియాలో పబ్జీ లవ్ హాట్ టపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఫేస్ బుక్ లవ్ తెరపైకి వచ్చింది.
అవును... పబ్ జీ గేమ్ లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఊరిలో ఉన్న ఇళ్లు అమ్మెసుకుని, వచ్చిన డబ్బుతో ప్రియుడి కోసం నలుగురు పిల్లలను వేసుకుని ఢిల్లీలో వాలిపోయింది. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పబ్ జీ గేం పరిచయంతో పాకిస్థాన్ మహిళ ప్రియుడి కోసం ఇండియాకి వస్తే... ఈ సారి ఫేస్ బుక్ పరిచయంతో భారత్ నుంచే ఓ మహిళ తన ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలోని భివాడీ ప్రాంతంలో అంజూ, అర్వింద్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నారు. అయితే అంజు (34) కు కొన్ని నెలల క్రితం ఫెస్ బుక్ లో పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో చాటింగులు కాస్తా ఫోన్ లో గంటల కొద్దీ కబుర్ల వరకూ వచ్చిందని తెలుస్తుంది. ఫలితంగా... పాకిస్థాన్ లో ఔషద రంగంలో పనిచేస్తోన్న నస్రుల్లా ని కలవాలని అంజు నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా... వాయువ్య పాకిస్థాన్ లోని ఖైధర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది.
అయితే పాకిస్థాన్ మహిళలలాగా ఈమె అక్రమంగా చొరబడినట్లు లేదని తెలుస్తుంది. పాకిస్థాన్ వెళ్లిన ఈమెను అక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అంజు మాత్రం వీసాతో పాటు కావాల్సిన పత్రాలన్ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.
ఏది ఏమైనా... ఆన్ లైన్ లో పరిచయం పెంచుకుని.. దాన్ని ప్రేమగా మార్చుకుని.. తమ ప్రియుడు లేదా ప్రియురాలి కోసం దేశాలు దాటి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అటు పబ్ జీ, ఇటు ఫేస్ బుక్... ఈ రెండు సంఘటనల్లోనూ ఇద్దరు మహిళలూ వివాహితులే.. పిల్లలు ఉన్నవారే!!