Begin typing your search above and press return to search.

యూఎస్ హెచ్-1బి వీసాదారులకు గుడ్ న్యూస్!

కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌

By:  Tupaki Desk   |   18 July 2023 6:33 AM GMT
యూఎస్ హెచ్-1బి వీసాదారులకు గుడ్ న్యూస్!
X

యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ వెల్లడించిందని తెలుస్తుంది. ఈ గ్యుడ్ న్యూస్ వల్ల అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలుస్తుంది. దీంతో... హర్షం వ్యక్తం చేస్తున్నారంట ఎన్నారైలు!

అవును... యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇక నుంచి హెచ్-1 బి వీసాదారులు కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపిందని అంటున్నారు. ఇదే సమయంలో యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ ను ప్రారంభించిందని తెలుస్తోంది.

దీంతో... కెనడా ప్రభుత్వం 10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుందని సమాచారం. యూఎస్ వీసాదారుల్లో ఉన్న టెక్నికల్ టాలెంట్ ను ఆకర్షించడానికి కెనడా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించిందని అంటున్నారు. ఇలా అత్యంత నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షించడానికి యూఎస్ నుంచి హెచ్ 1 బి వీసా హోల్డర్లకు కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించిందని అంటున్నారు.

ఇందులో భాగంగా... యూఎస్ వీసా ఉన్న వారు మూడు సంవత్సరాల పాటు కెనడాలో పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించనుందని తెలుస్తుంది. 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1-బి వీసా హోల్డర్‌ లు, వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఒక ప్రకటనలో తెలిపిందని సమాచారం.

మరోపక్క... అమెరికాలో పనిచేస్తోన్న భారతీయులకు హెచ్‌-1బీ వీసాల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారై లు తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఒక పైలట్‌ ప్రొగ్రామ్‌ ను తెరపైకి తెచ్చింది.

కాగా... 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4,42,000 మంది హెచ్‌-1బీ వీసా వినియోగదారుల్లో 73 శాతం మంది భారతీయులే ఉన్నారని ఘణాంకాలు విడుదలైన సంగతి తెలిసిందే.