Begin typing your search above and press return to search.

ఇండియాతో అంత "ఈజ్"కాదు... మాల్దీవులకు మరో భారీ షాక్!

అవును... భారత్‌ పైనా, భారత ప్రధానిపైనా మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:18 AM GMT
ఇండియాతో అంత ఈజ్కాదు...  మాల్దీవులకు మరో భారీ షాక్!
X

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని అంటారు. ఈ సూత్రం తెలియదో ఏమో కానీ... భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మంత్రులు. ఈ వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వారికి ప్రధాన ఆదాయ వనరైన టూరిజంకు గుయ్ మనిపించే సౌండ్ వచ్చేలా దెబ్బ తగిలింది. భారత్‌ పైనా, భారత ప్రధానిపైనా ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం తెరపైకి వచ్చింది.

అవును... భారత్‌ పైనా, భారత ప్రధానిపైనా మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఈ సందర్భంగా "బాయ్‌ కాట్ మాల్దీవ్స్" అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ఇండియన్ టూరిస్ట్స్ తమ టూర్‌ లను రద్దు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో... తాజాగా "ఈజ్ మై ట్రిప్" అనే సంస్థ మాల్దీవులకు ఫ్లీట్ బుక్కింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది! భారతదేశం, ప్రధానిపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో అన్ని మాల్దీవుల విమాన బుకింగ్‌ లను నిలిపివేస్తున్నట్లు "ఈజ్ మై ట్రిప్" సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిషాంత్ పిట్టి ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదే సమయంలో ఇప్పటికే బుక్కింగ్స్ చేసుకున్నవారు క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని తక్కువ కండిషన్స్ తో కల్పించినట్లు చెబుతున్నారు! దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది! భారతదేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిషాంత్ పిట్టి ప్రకటించారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు తెలుస్తుంది. ఈ వరుస దెబ్బలు మాల్దీవుల టూరిజంపై ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.

మరోపక్క.. భారత్‌ పై చేసిన వ్యాఖ్యలకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.