Begin typing your search above and press return to search.

న్యూయార్క్ కు ఇండియన్ టూరిస్టుల తాకిడి... అంచనా ఇదే!

ఈ సంవత్సరం భారతదేశం నుండి దాదాపు 3,06,000 మంది ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వడానికి న్యూయార్క్ నగరం ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 6:24 AM GMT
న్యూయార్క్  కు ఇండియన్  టూరిస్టుల తాకిడి... అంచనా ఇదే!
X

కారణం ఏమైనప్పటికీ అమెరికాకు - ఇండియాకు ఏదో ఒక అద్భుతమైన బంధం ఉందని అటుంటారు. అమెరికా విషయంలో భారతీయుల ఆసక్తి అందుకు ఒక కారణం కాగా.. వారి సామర్థ్యానికి తగిన సరైన ఎంపిక అదేననేది మరోకారణంగా చెబుతుంటారు. ఈ సమయంలో అమెరికా వెళ్లే ఇండియన్ టూరిస్టులకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును.... న్యూయార్క్ సిటీ టూరిజం అండ్ కన్వెన్షన్స్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశం నుండి దాదాపు 3,06,000 మంది ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వడానికి న్యూయార్క్ నగరం ఎదురుచూస్తోంది. ఫలితంగా... పర్యాటక రంగం పుంజుకోవడం న్యూయార్క్ నగరం ఆర్థిక పునరుద్ధరణకు ఆజ్యం పోస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

2019లో, న్యూయార్క్ నగరం మొత్తం 66.6 మిలియన్ల సందర్శకులను స్వాగతించింది. ఇది నగరం రికార్డు టూరిజం వృద్ధిలో వరుసగా 10వ సంవత్సరం. వీరిలో 13.5 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులు కాగా.. 3,36,000 మంది కేవలం భారతదేశానికి చెందినవారు ఉండటం గమనార్హం.

అయితే కోవిడ్ అనంతరం 2023లో, న్యూయార్క్ నగరం 11.4 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులను అంచనా వేసింది. ఇందులో కేవలం ఒక్క భారతదేశం నుంచే సుమారు 3,06,000 మంది ప్రయాణికులను అందించింది.

అయితే కెనడియన్ అడవి మంటలు, భయంకరమైన వేడి తరంగాలు, వరుసగా జరుగుతున్న తుపాకీ కాల్పుల సంఘటనల కారణంగా న్యూయార్క్‌ ను ఇష్టపడే భారతదేశంలోని తెలుగు కుటుంబాలు ఈ సంవత్సరం దూరంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. కానీ ఈ ఏడాది ద్వితియార్ధంలో ఆ లెక్క భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా... న్యూయార్క్ నగరానికి సంబంధించిన టాప్ 10 అంతర్జాతీయ మూలాధార మార్కెట్‌ లలో భారతదేశం 10వ స్థానంలో ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఈ లిస్ట్ లో యునైటెడ్ కింగ్‌ డమ్ అగ్రస్థానంలో ఉండగా.. కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, స్పెయిన్, జర్మనీ, మెక్సికో, ఇటలీ, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి!

భారతీయ సందర్శకులు ఎక్కువగా హోటల్ వసతి, భోజనాలు, షాపింగ్ కోసం ఖర్చు చేస్తారని అంటున్నారు. దీంతో... న్యూయార్క్ నగరంలో 700 మిలియన్ డాలర్ల వ్యయంతో భారతదేశం నాల్గవ అత్యధిక ఖర్చు చేసే అంతర్జాతీయ మార్కెట్‌ గా ర్యాంక్ పొందిందని అంటున్నారు.