Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌ పోర్ట్ ఇదే!

ప్రపంచంలోని బలహీనమైన పాస్‌ పోర్ట్‌ లలో ఆఫ్ఘనిస్తాన్ పాస్‌ పోర్ట్ 109 స్థానంలో ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   20 July 2023 11:42 AM GMT
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన  పాస్‌  పోర్ట్  ఇదే!
X

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌ పోర్ట్ అసోసియేషన్ అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా లండన్‌ కు చెందిన గ్లోబల్ సిటిజన్‌ షిప్ రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌ నర్స్ 2023 సంవత్సరానికి హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్‌ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అత్యంత బలహీనమైన పాస్ పోర్టు కలిగిన దేశాల లిస్ట్ తెరపైకి వచ్చింది.

హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. కేవలం 17 శాతం దేశాలు మాత్రమే ప్రపంచంలోని 227 గమ్యస్థానాలలో నాలుగు ఐదవ వంతుల కంటే ఎక్కువ వీసారహిత యాక్సెస్‌ ను మంజూరు చేస్తాయని తెలిసింది. ప్రపంచంలోని బలహీనమైన పాస్‌ పోర్ట్‌ లలో ఆఫ్ఘనిస్తాన్ పాస్‌ పోర్ట్ 109 స్థానంలో ఉందని తెలుస్తుంది. ఈ పాస్ పోర్ట్ సాయంతో కేవలం 27 దేశాలకు మాత్రమే వీసాలేకుండా ప్రయాణించే సౌకర్యం ఉంటుంది.

తర్వాత స్థానంలో ఇరాక్ 29 దేశాలకు వీసాలేకుండా వెళ్లే పాస్ పోర్ట్ తో 108 వస్థానంలో ఉంది. ఇదే సమయంలో సిరియా వీసా ఫ్రీ స్కోర్ 30తో 107వ స్థానంలో ఉండగా... పాకిస్థాన్ వీసా ఫ్రీ స్కోర్ 32తో 106వ స్థానంలో ఉంది. అనంతరం యెమెన్ వీసా ఫ్రీ స్కోర్ 34తో 105వ స్థానంలో ఉంది. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌ పోర్ట్స్ లో టాప్ 5 జాబితా ఉంది.

ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 59 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తూ... భారత్ 80వ స్థానంలో ఉంది! దీంతో భారత పాస్‌ పోర్ట్ హోల్డర్‌ లు నేపాల్, శ్రీలంక, థాయ్‌ లాండ్, ఇండోనేషియా, కెన్యా, మారిషస్, సీషెల్స్, భూటాన్, కంబోడియా, మకావో, మాల్దీవులు, జింబాబ్వే, ఉగాండా, ఇరాన్, ఖతార్ వంటి 59 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని తెలుస్తుంది.

మరోపక్క అత్యంత పవర్ ఫుల్ పాస్ పొర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ రికార్డ్ సృష్టించింది. ఈ పాస్‌ పోర్ట్‌ తో ఎలాంటి వీసా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 192 దేశాలకు ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ఇదే సమయంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయని అంటున్నారు. ఈ దేశాల పాస్‌ పోర్టులు కలిగిన వారు ఎలాంటి వీసా అవసరం లేకుండా 190 దేశాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు.

అదేవిధంగా ఈ జాబితాలో జపాన్ మూడొస్థానంలో ఉంది. ఈదేశ పాస్‌ పోర్ట్‌ తో వీసా లేకుండా 189 దేశాలకు ప్రయాణించవచ్చట. ఈ మూడో ప్లేస్ లో జపాన్‌ తో పాటు, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ పాస్‌ పోర్ట్‌ లు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇక ఈ ర్యాంకింగ్స్ లో డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌ డమ్ దేశాల పాస్ పోర్ట్ లు నాల్గవ స్థానంలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ పాస్ పోర్ట్ తో 188 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చని అంటున్నారు. ఇదే క్రమంలో... ఐదోస్థానంలో ఉన్న బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ పాస్‌ పోర్ట్‌ లను కలిగి ఉన్న వ్యక్తులు 187 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు!