Begin typing your search above and press return to search.

''ఓం'' వివరాలు రాష్ట్రపతికి మాత్రమే రామోజీ చెప్పారు

By:  Tupaki Desk   |   6 July 2015 4:19 AM GMT
ఓం వివరాలు రాష్ట్రపతికి మాత్రమే రామోజీ చెప్పారు
X
మీడియా మొఘల్‌ రామోజీరావు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు ఓం. దేశంలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన నకళ్లను పున:ప్రతిష్ఠ చేసి.. ఆయా క్షేత్రాల్లో ఏ విధంగా పూజలు చేస్తారో.. సరిగ్గా అదే తీరుతో పూజలు చేసే ఈ అద్భుత ప్రాజెక్టుకు సంబంధించిన దార్శనిక పుస్తకాన్ని అత్యంత ప్రముఖులకు ఇవ్వటం తెలిసిందే.

మొట్టమొదటిసారి ఈ ఓం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగంగా ప్రధాని మోడీకి వివరించారు. ఆయనకు ఓం ప్రాజెక్టు దార్శనిక పుస్తకాన్ని అందించి విశేషాలు వెల్లడించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. తాజాగా.. హైదరబాద్‌కు వర్షాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌కు ఓం ప్రాజెక్టుకు సంబంధించిన దార్శనిక పుస్తకాన్ని అందించి..ప్రాజెక్టు వివరాల్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ సైతం.. ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ.. దీన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? నిర్మాణ పనులకు సంబంధించి పలు ప్రశ్నలు వేయటం.. దానికి రామోజీరావు సమాధానలు చెప్పటం జరిగిపోయాయి. కాకపోతే.. దీనికి సంబంధించిన సమాచారాన్ని రామోజీ తన పేపర్లో అచ్చేయలేదు. ప్రజలకు ఎంత సమాచారం అవసరమో.. అంత సమాచారాన్ని మాత్రమే ఇచ్చి.. మిగిలిన వాటిని లేఖా మాత్రంగా కూడా ప్రస్తావించని రామోజీ.. ఓంప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రపతి వేసిన ప్రశ్నలకు సంబంధించి రామోజీ ఇచ్చిన సమాధానాల్ని మాత్రం ప్రచురించలేదు.

నిజానికి ఓం ప్రాజెక్టు లాంటి అద్భుత ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని తెలసుకునే విషయంలో సామాన్యులకు కూడా ఎంతో ఆసక్తి ఉంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు ఎప్పుడు మొదలువుతందా? ఎప్పటికి పూర్తి అవుతుంది? దీనికి సంబంధించిన ప్రాజెక్టు పనులు ఇప్పటికే స్టార్ట్‌ అయ్యాయా లాంటి విషయాలు గోప్యంగా ఉంచుతున్నారే తప్పించి వెల్లడించని పరిస్థితి. అయినా.. అసమాన్యమైన విషయాలు సామాన్యులకు అవసరం లేదని రామోజీ భావిస్తున్నారేమో.