Begin typing your search above and press return to search.
రాజమండ్రిలో తిరుమల వెంకన్న
By: Tupaki Desk | 3 July 2015 11:19 AM పుష్కరాలకు రాజమండ్రి సిద్ధమైపోతోంది... మరో పది రోజుల్లో మొదలయ్యే పుష్కరాలకు సకల ఏర్పాట్లూ జరుగుతున్నాయి. పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని పుష్కారాల ప్రారంభానికి రెండు రోజుల ముందే పూర్తి చేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13న ఉదయం 9.30 గంటలకు నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తారు. 14 నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించొచ్చు. ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేస్తారు.
పుష్కరాల సందర్భంగా టీటీడీ రాజమండ్రిలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుతోపాటు, ఎగ్జిబిషన్లు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నమూనా ఆలయం వద్ద క్యూలైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రిలోని సుబ్రమణ్య మైదానం, ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.