Begin typing your search above and press return to search.
అమరావతి... ఆంధ్రుల నూతన రాజధాని!!
By: Tupaki Desk | 8 Jun 2015 10:22 AM GMTదక్షిణ భారతదేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి! ఇక్కడ ఉన్న అమరేశ్వర టెంపుల్, బౌద్ధరామాలు కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ప్రాచీన శాసనాల ప్రకారం అమరావతిని అప్పట్లో "ధాన్య కటకం" లేదా "ధరణికోట" అని పిలిచేవారట! ప్రస్తుతం అమరావతిలోని బౌద్ధ రామాలు, అద్భుత శిల్పాలు శిధిలమై ఉన్నప్పటికీ, ఆ శిధిలైమన్ వాటిని ఇప్పుడు చూసినా వాటి బృహత్తర నిర్మాణాల పట్ల ఆశ్చర్యం కలుగుతుంది! నానాటికి శిదిలమైపోతున్న ఈ బౌద్ధ మత అవశేషాలు ఇంకా ప్రకృతి నియంత్రణలో వుండటం మన అదృష్టం అనే చెప్పాలి!
క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాత వాహనులకు, వారి సామ్రాజ్యానికి ఈ అమరావతే రాజధానిగా వుండేది. ఈ అమరావతిలోనే గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను బోధించాడు. అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడ్డ అమరావతి స్తూపం, పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణలు కలిగిఉండటంతో పాటు, చారిత్ర కలిగిన ప్రాంతం కావడంతో ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా అమరావతి ప్రసిద్ధికెక్కింది!
అమరావతికి చేరుకోవడం ఎలాగంటే....
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బస్సు ద్వారా అమరావతికి గంట సమయంలో చేరుకోవచ్చు!
రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే... గుంటూరు గాని విజయవాడలో గాని రైలు దిగి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చు!
రోడ్డు మార్గం ద్వారా అయితే... విజయవాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి చేరుకోవడానికి విజయవాడ నుండి చాలా బస్సులున్నాయి. గుంటూరు నుండి అయితే అమరావతి చేరుకోవడానికి 32 కిలోమీటర్లు దూరం ఉంటుంది! గుంటూరు నుండి కూడా డైరెక్ట్ బస్సులు చాలానే ఉన్నాయి!
ఇప్పుడు అమరావతిలో చూడదగ్గ అద్భుత ప్రదేశాల గురించి తెలుసుకుందాం...
అమరావతి స్తూపం:
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల ఈ అమరావతిలో... అమరావతి స్తూపం లేదా మహా చైత్య ఒక గొప్ప ఆకర్షణ.అశోక చక్రవర్తి కాలంలో ఈ స్తూపాలు నిర్మించబడ్డాయి. ఈ స్తూపం, దానిపై చెక్కబడిన బుద్ధుడి జీవిత కథ, అతని బోధనలను అద్భుతం అనే చెప్పాలి! పర్యాటకులు ఇక్కడికి వచ్చి బుద్ధుని స్థూపాలను దర్శించి ఆయన బోధనలు తెలుగుసుకుని ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తుంటారు. చాలా మంది బౌద్ధ భిక్షులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు!
కృష్ణానది:
పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ఎంతో ఆహ్లాదకరమైన నదీ తీరం కృష్ణా నదీ ప్రాంతం! ఇది జీవనది! ఈ ప్రాంతంలోని కృష్ణా నదీ తీరంలో హిందువులు ప్రత్యేక స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ ప్రాంతంలో కృష్ణానదిలో పుష్కరాలు కూడా బాగా జరుగుతాయి! ఇది ఎంతో విలువైన ఆస్తిగా అక్కడి ప్రజలు భావిస్తారు.
ఆర్కియోలాజికాల్ మ్యూజియం:
అమరావతిలో కృష్ణా నదికి కుడి వైపున ఆర్కియోలాజికాల్ మ్యూజియం ఉంటుంది. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆనాటి ప్రాంత ప్రజల సాంప్రదాయాలు, చరిత్రకారుల విశేషాలు మొదలైన అంశాలను తెలియజేసే వస్తువులు ఈ మ్యూజియం లో భద్రపరచబడ్డాయి! అమరావతి కేంద్రంగా పుట్టిన కళలకు, భారతీయ కళలకు చారిత్రక ఆధారాలు ఇస్తోంది ఈ మ్యూజియం! సుమారు 3వ శతాబ్దం లో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలు సైతం ఈ మ్యూజియం లో ఉన్నాయి!