Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ప్రశాంత్ కిశోర్ ?

అందుకే బీహార్ లో తనకంటూ ఒక సొంత పార్టీ ఉండాలని పెట్టుకుని పాదయాత్ర చేశారు కానీ అక్కడ ఆ పార్టీ అతీ గతీ లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:30 PM GMT
బీజేపీలోకి ప్రశాంత్ కిశోర్ ?
X

ఆయన రాజకీయ వ్యూహకర్త అవతారం నుంచి రాజకీయ నేత అవతారం ఎత్తారు. రాజకీయ వ్యూహాలు అన్నీ పట్టుబడిన తరువాత ఇక చేరాల్సిన గమ్య స్థానం రాజకీయాలోకే. అందుకే బీహార్ లో తనకంటూ ఒక సొంత పార్టీ ఉండాలని పెట్టుకుని పాదయాత్ర చేశారు కానీ అక్కడ ఆ పార్టీ అతీ గతీ లేకుండా పోయింది.

దాంతో మళ్లీ వివిధ రాజకీయ పార్టీలతో పాత కొత్త సంబంధాలను కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తన కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 2014లో దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీని చేసేందుకు బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచించిన పీకే 2024 ఎన్నికల్లో బయట నుంచి బీజేపీకి సపోర్ట్ గా గొంతు వినిపించారు. ఆయన అనేక ఇంటర్వ్యూలలో దేశంలో బీజేపీ గెలుస్తోంది అంటూ చేసిన పాజిటివ్ కాంపెయిన్ ఆయనలోని విశ్లేషకుడు ఇంకా ఉన్నాడని భావించిన వారిని విస్తుబోయేలా చేసింది.

అలా పీకే బీజేపీకి ఫుల్ ఫేవర్ గా వర్క్ చేశారు అన్నది 2024 ఫలితాలను బట్టి చూస్తే అర్థం అయింది. మరో వైపు చూస్తే పీకే నిరంతరం చేస్తునంది ఒక్కటే. బీజేపీ జపం. బీజేపీని ఆకాశానికి ఎత్తేయడం, అదే టైం లో కాంగ్రెస్ ని పూర్తిగా కించపరచడం వంటివి చేశారు.

ఇక ఐప్యాక్ టీం తోనూ తెర వెనక రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేసి జగన్ ఓడుతారు అన్న విషయం తాను బయటకు చెబుతూ ఐ ప్యాక్ టీం అసలు నిజాలు జగన్ కి చెప్పకుండా దాచిపెట్టి ఉంచడంలోనూ పీకే సక్సెస్ అయ్యారు. ఇక ఈసారి ఎన్నికల్లో పీకే బహుముఖ అవతారాలే ఎత్తారు. పైకి విశ్లేషకుడిగా ఉంటూ దేశంలో బీజేపీ గెలుస్తుంది అని ఊదరగొట్టారు. లోపల వ్యూహకర్తను అలాగే ఉంచారు. అలా అటు టీడీపీకి లోపాయికారీగా వ్యూహకర్తగా మారారు.

అందుకే ఏపీలో ఎన్డీయే కూటమి గెలుస్తోంది అని పీకే చెప్పారు. జగన్ ని అలా దెబ్బ తీశారు. బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ అనేక ప్రెస్ మీట్లను కూడా పీకే పెట్టడాన్ని అంతా చూసారు. ఆయన నోరు విప్పితే బీజేపీకి 350 సీట్లు తగ్గవని జోస్యాలు చెబుతూ వచ్చారు.

ఇలా కాషాయం పార్టీకి ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా బీజేపీ నంబర్ 240 వద్దనే పడిపోయింది. ఆ పార్టీకి ఫుల్ మెజారిటీ ఈసారి దక్కలేదు. దీంతో పీకే చెప్పిన జోస్యాలు తప్పు అని నిరూపితం అయ్యాయి. ఇక ఎన్నికల ఫలితాల తరువాత కూడా పీకే బీజేపీకి భజన చేస్తూ తాను చెప్పిన నంబర్లు రాలేదని తప్పు ఒప్పుకోవడంలేదు. అంతే కాదు కింద పడినా బీజేపీదే పై చేయి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

అదే టైం లో ఈసారి కాంగ్రెస్ ఎంతో గొప్పగా పెర్ఫార్మ్ చేసినా కూడా ఆ పార్టీని అవమానిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపుని చులకన చేస్తున్నారు అని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ ఇమేజ్ పెరగలేదు అని తప్పుడు వ్యాఖ్యానాలు చెబుతున్నారు అంటున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులలో మాత్రమే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది తప్ప దేశంలో ఎక్కడా పెరగలేదు అని పీకే చెబుతున్న వక్ర భాష్యాలు మంట పుట్టించేలాగానే ఉన్నాయని అంటున్నారు.

ఇక బీజేపీ మెజారిటీ తెచ్చుకోలేక చతికిలపడిపోతేపీకే మాత్రం తాను చెప్పిన నంబర్లు బీజేపీకి రాలేదు బీజేపీకి వ్యతిరేకత లేదు అని కొత్త మాటలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల జనంలో నెగిటివిటీ లేదు అంటున్నారు. మోడీ ఇమేజ్ తో ఆయన బొమ్మతోనే బీజేపీ ఈసారి ఎన్నికలను ఎదుర్కొంది. అలాంటిది బీజేపీ సీట్లు తగ్గిపోతే మోడీ పట్ల వ్యతిరేకత లేదు అని పీకే అనడమే చిత్రంగా ఉంది అంటున్నారు.

బీజేపీ ఓటు యధాతధంగా ఉంది అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా పీకే చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ 99 ఎంపీ సీట్లు సాధిస్తే పీకేకి అవి కనిపించడం లేదా అని అంటున్నారు. పీకే మాత్రం కాంగ్రెస్ కి ఆ పార్టీ చరిత్రలో వచ్చిన అతి తక్కువ సీట్లుగా వాటిని చెప్పడం చూస్తే కాంగ్రెస్ పట్ల ఆయన ఎంత వ్యతిరేకతను పోగు చేసుకున్నారో అర్ధం అవుతోంది అంటున్నారు.

బీజేపీ కింద పడ్డా బీజేపీదే పై చేయి అని చెబుతున్న పీకేకి పదేళ్ల మోడీ పాలనలో పెరిగిన ద్రవ్యోల్బణం, అలాగే దారుణంగా పెరిగిన నిరుద్యోగం రేటు దేశంలో వివిధ సెక్షన్లలో పేరుకుపోయిన తీవ్ర స్థాయి అసంతృప్తి ఏమీ కనిపించలేదా అని కూడా నిలదీస్తున్నారు. అయితే పీకే ఈ రకంగా బీజేపీని వెనకేసుకుని రావడం వెనకపెద్ద ఆశలే ఉన్నాయని అంటున్నారు

బీజేపీలో ఆయన చేరుతారు అని అంటున్నారు. ఆయన అధికార లాలసతో కూడిన పదవుల రాజకీయంతోనే పెదవుల మీద బీజేపీ భజన సాగుతోంది అని అంటున్నారు. ఈ ఎన్నికలలో నిరూపితమైన మరో అంశం ఏంటి అంటే పీకే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక వ్యూహకర్తగా పూర్తిగా విశ్వసనీయతను కోల్పోవడం. అందుకే ఆయన బీజేపీలో చేరి రాజకీయ నేత అవతారం ఎత్తుతారు అని గట్టిగా వినిపిస్తున్న మాట అంటున్నారు.