Begin typing your search above and press return to search.

బుర్ఖాలో నటి వీడియో వైరల్

హీరోలు.. హీరోయిన్స్ మాత్రమే కాకుండా కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీలు కూడా రోడ్ల పై తిరగడం ఇబ్బంది. వారిని జనాలు గుర్తు పడితే సెల్ఫీ అంటూ మీద పడటంతో పాటు వారి ప్రైవేట్ లైఫ్‌ కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   24 July 2023 10:21 AM GMT
బుర్ఖాలో నటి వీడియో వైరల్
X

హీరోలు.. హీరోయిన్స్ మాత్రమే కాకుండా కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీలు కూడా రోడ్ల పై తిరగడం ఇబ్బంది. వారిని జనాలు గుర్తు పడితే సెల్ఫీ అంటూ మీద పడటంతో పాటు వారి ప్రైవేట్ లైఫ్‌ కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు ఎక్కువ శాతం బయటకు వెళ్తే ముసుగు ధరించి వెళ్తూ ఉంటారు. తాజాగా స్వాతి కూడా ఏకంగా బుర్ఖా లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

హీరోయిన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్వాతి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మళ్లీ ఈ మధ్య కాలంలో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా స్వాతి రైల్వే స్టేషన్‌ కు వెళ్లింది. అక్కడ తనను గుర్తు పట్టకుండా బుర్ఖా ధరించింది.

స్వాతిని బుర్ఖా లో ఎవరు గుర్తు పట్టలేదు. అక్కడ హాయిగా తిరుగుతూ.. బుక్ స్టాల్‌ లో బుక్ తీసుకుని చూస్తున్నా కూడా స్వాతి అన్నట్టు ఆమె ను ఎవరు గుర్తు పట్టలేదు. స్వాతి ఇన్ స్టా గ్రామ్‌ లో ఈ వీడియో షేర్‌ చేయడంతో చాలా మంది స్వాతి ఏదైనా ప్రమోషన్‌ కోసం లేదా షూటింగ్‌ కోసం బుర్ఖా వేసుకుందా లేదంటే నిజంగానే స్వాతి రైలు ప్రయాణం చేసిందా అని చర్చించుకుంటున్నారు.

ప్రతిభావంతురాలు అయిన స్వాతి తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రాలేదు అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ను సహాయక పాత్రల కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగా కాకుండా స్వాతికి ఇప్పుడు కచ్చితంగా మరిన్ని ఆఫర్లు రావచ్చు అనే టాక్ వినిపిస్తోంది.