Begin typing your search above and press return to search.

"అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్) - సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దం

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం "అష్టదిగ్బంధనం"

By:  Tupaki Desk   |   20 Sep 2023 5:30 AM GMT
అష్టదిగ్బంధనం (ఎ గేమ్ విత్ క్రైమ్) - సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దం
X

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం “అష్టదిగ్బంధనం“ (ఎ గేమ్ విత్ క్రైమ్) ఉప శీర్షిక. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇటీవల “బేబీ“ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ రిలీజ్చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యుబ్ లో వన్ మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లతో నిండిన ట్రైలర్ లో "యుద్ధం ఎప్పుడు బలినే కోరుకుంటుంది, ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమో, అధికారం కోసమో కాదు.. అహం కోసం ! "అంటూ సాగిన వాయిస్ ఓవర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చివర్లో "అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది" అనే డైలాగ్ చాలా బాగుంది.

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో అందరు కొత్తవాళ్ళతో చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.

రీసెంట్ గా "ఉప్పెన" మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా లాంచ్ చేసిన ఈ సినిమాలోని “ఐయాం విత్ యూ“ సాంగ్ కూడా ఫ్రెష్ ట్యూన్ తో ఆకట్టుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయ్యి విమర్శకుల ప్రశంశలు అందుకున్న “ట్రాన్స్“ సినిమాకి మ్యూజిక్ అందించిన జాక్సన్ విజయన్ ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయం అవుతున్నారు. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడం అష్టదిగ్బంధనం సినిమాకు కలిసివచ్చే అంశం.

"అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్) సినిమాకు రచన-దర్శకత్వం: బాబా పి.ఆర్, నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్, మ్యూజిక్: జాక్సన్ విజయన్, ఎడిటర్: సత్య గిడుతూరి, కెమెరా: బాబు కొల్లబత్తుల,పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, ఈ వారం శుక్రవారం (సెప్టెంబర్ 22) విడుదలవుతోంది.