Begin typing your search above and press return to search.

"అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్) - సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దం

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం " అష్టదిగ్బంధనం"

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:56 AM GMT
అష్టదిగ్బంధనం (ఎ గేమ్ విత్ క్రైమ్) - సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దం
X

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లో బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం " అష్టదిగ్బంధనం" (ఎ గేమ్ విత్ క్రైమ్ ) ఉప శీర్షిక.

సెప్టెంబర్ 22న విడుదల కానున్నఈ సినిమా ట్రైలర్ యూట్యుబ్ లో వన్ మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. ఈ సందర్భంగా సినిమా టీం రెండో ట్రైలర్నిలాంచ్చేశారు. మొదటి ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్ చూపించిన టీమ్, రెండో ట్రైలర్లో ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్వ్యూ నుండి కథని చెప్పే ప్రయత్నం చేశారు.

“హాయిగా సాగిపోతున్న హీరో లైఫ్లోకి హఠాత్తుగా కొంతమంది ఎంటర్అయ్యి ఎలాంటి సమస్యలు సృష్టించారు, వాటి నుండి హీరో ఎలా బయటపడ్డాడు” అనే కోణంలో ట్రైలర్ విడుదల చేసారు. ఇంట్రస్టింగ్గా సాగిన ట్రైలర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది.

అష్టదిగ్బధనం సినిమా నుండి విడుదల అయిన రెండు ట్రైలర్లు ఆసక్తిగా ఉన్నాయి. చిన్న సినిమా అయిన కంటెంట్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది.

“అష్టదిగ్బంధనం“ (ఎ గేమ్ విత్ క్రైమ్) సినిమాకు రచన-దర్శకత్వం: బాబా పి.ఆర్, నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్, మ్యూజిక్: జాక్సన్ విజయన్, ఎడిటర్: సత్య గిడుతూరి, కెమెరా: బాబు కొల్లబత్తుల, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి ఈ వారం శుక్రవారం (సెప్టెంబర్ 22) విడుదలవుతోంది.