Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌ : రిలీజ్ ముందు ఆసక్తి పెంచిన చంద్రముఖి 2

చంద్రముఖి సీక్వెల్ అంటే కచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు జ్యోతిక ఉంటే బాగుంటుందని మొన్నటి వరకు ప్రేక్షకులు భావించారు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 5:00 AM GMT
ట్రైలర్ టాక్‌ : రిలీజ్ ముందు ఆసక్తి పెంచిన చంద్రముఖి 2
X

చంద్రముఖి సీక్వెల్ అంటే కచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు జ్యోతిక ఉంటే బాగుంటుందని మొన్నటి వరకు ప్రేక్షకులు భావించారు. కానీ వారిద్దరు లేకుండానే చంద్రముఖి 2 సినిమా పూర్తయింది. ఇప్పటికే విడుదల ఇవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు వాసు, హీరో లారెన్స్ హీరోయిన్ కంగనా రనౌత్ దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సినిమాకి ఒక మోస్తరు హైప్‌ తీసుకు రావడంలో వారు సఫలమయ్యారు అనిపిస్తుంది. తాజాగా సినిమా రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళ్తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. వడివేలు కామెడీ తో పాటు లారెన్స్ ఇంకా కంగనా సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మొదటి ట్రైలర్లో మాదిరిగానే చంద్రముఖిని ఎక్కువగా రివీల్ చేయకుండా లైట్ గా కంగనాన్ని చూపించి చూపించకుండా చూపించారు. సినిమాపై ఆసక్తి పెంచడంలో ఈ ట్రైలర్ కచ్చితంగా అంతో ఎంతో పని చేస్తుంది అనడంలో సందేహం లేదు.

భారీ ఓపెనింగ్స్ రాకున్నా కూడా సినిమా పట్ల ఆసక్తి కలిగించడంలో ట్రైలర్ లోని కంటెంట్ ఉపయోగపడుతుంది. చంద్రముఖి మొదటి భాగం కి సంబంధించిన సన్నివేశాలను కలుపుతూ సరికొత్త కథను ఈ రెండవ భాగంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

రజినీకాంత్ పాత్రలో లారెన్స్ ని చూడబోతున్నామా లేదంటే ఆయన పాత్ర కొత్తదిగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రజనీకాంత్ జ్యోతిక లేకున్నా కూడా చిత్ర యూనిట్ సభ్యులు కాస్త ఎక్కువ కష్టపడి చంద్రముఖి 2 కి భారీగానే పబ్లిసిటీ చేయడం జరిగింది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.