Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2 ట్రైలర్.. ఏం మారలేదు!

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్- బాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'.

By:  Tupaki Desk   |   3 Sep 2023 1:07 PM GMT
చంద్రముఖి 2 ట్రైలర్.. ఏం మారలేదు!
X

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్- బాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'. హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. 18 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా ఇది రాబోతుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడు పి.వాసునే దీనిని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడటం వల్ల ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రముఖి సినిమా చివర్లో భవనం నుంచి ఓ పెద్ద పాము బయటకు వెళ్లిపోతుంది కదా.. ఆ పామును చూపిస్తూనే చంద్రముఖి-2 ట్రైలర్​ను మొదలుపెట్టారు మేకర్స్​. ఆ తర్వాత వెట్టయరాజా గురించి చెబుతూ.. ప్రస్తుతం కాలంలో ఉన్న రాఘవ లారెన్స్ యాక్షన్ సీక్వెన్స్​ను చూపించారు.

రాధికా శరత్ కుమార్ కుటుంబం చంద్రముఖి భవనంలోకి వెళ్లడం, ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఉందన్న విషయాన్ని చెబుతూ ఎప్పటిలానే హైలెట్ చేశారు. స్టార్ కమెడియన్ వడివేలు అదే కామెడీతో ఆ భవనంలో భయపడుతూ కామెడీ చేస్తున్నారు. 'అది జరిగి 17 ఏళ్లు అవుతుందంది. ఇది కచ్చితంగా అదే' అంటూ వడివేలు చంద్రముఖి గురించి చెప్పి కాస్త భయపెట్టించారు.

చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ ప్రచార చిత్రంలో ఆమె పాత్రను పూర్తిగా రివీల్​ చేయలేదు. కాసేపే చూపించారు. ఇక ఫ్లాష్‍బ్యాక్‍లో రాఘవా లారెన్స్​ను వెట్టయరాజగా చూపిస్తూ ఎలివేషన్ బాగా ఇచ్చారు. మొదటి భాగంలోలానే చంద్రముఖికి, వెట్టయరాజాకు మధ్య 200 ఏళ్ల నాటి పగ ఉన్నట్టు ప్రచార చిత్రంలో చూపించారు. ఫైనల్​గా 17ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్​ అవుతుందా అని ముగించారు. ఆస్కార్ అవార్డ్​ విన్నర్, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్​ కూడా బానే ఉంది.

మొత్తంగా ఈ ట్రైలర్ పర్వాలేదనిపించేలా ఉన్నా.. చంద్రముఖి సినిమాలానే అనిపిస్తోంది. కథ, కథనం మొత్తం అలానే అనిపిస్తోంది. ప్రచార చిత్రంలో హారర్​ పార్ట్​ను చూపించలేదు. కేవలం యాక్షన్​, కామెడీతోనే ట్రైలర్​ను కట్ చేశారు. సెప్టెంబర్ 15న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలో వడివేలుతో పాటు రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, రావురమేశ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.చూడాలి మరి దర్శకుడు పి.వాసు తన మొదటి సినిమా చంద్రముఖికి, ఈ సీక్వెల్​కు ఎలాంటి వైవిధ్యాన్ని చూపించారో..