Begin typing your search above and press return to search.

'హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌' సాంగ్‌ కి దర్శకేంద్రుడి ప్రశంసలు

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో రూపొందిన 'హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌' మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 11:19 AM GMT
హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంగ్‌ కి దర్శకేంద్రుడి ప్రశంసలు
X

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో రూపొందిన 'హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌' మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఇప్పటికే మూడు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఆ మూడు పాటలు కూడా టి సిరీస్ ద్వారా యూట్యూబ్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఆ పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ సినిమా నుంచి నాల్గవ పాటను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఆర్‌ కే సినీ ప్లెక్స్‌ లో ఈ పాటను రాఘవేంద్ర రావు చేతుల మీదుగా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయించారు. యూఎస్‌ లో ఫిల్మ్‌ స్కూల్‌ ఫ్యాకల్టీ గా సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన బాల పలు విషయాల గురించి రాఘవేంద్ర రావు తో చర్చించారు.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లోని చివరి పాట మెలోడియస్ గా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అన్నారు. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్‌ చక్కని బాణీలతో ఈ పాటకి సంగీతాన్ని అందించాడు అంటూ దర్శకేంద్రుడు అభినందించారు.

యూఎస్ కు వెళ్లిన సమయంలో, మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డీన్ గా బాల తో తనకు సుదీర్ఘ పరిచయం ఉందని అన్నారు. పాటలోని సాహిత్యం బాగుందన్న రాఘవేంద్ర రావు తప్పకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని అన్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులకు రాఘవేంద్ర రావు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ న్యూ రీల్‌ ఇండియా ఎంటర్‌ టైన్‌మెంట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై కేకేఆర్ మరియు బాల రాజ్ లు నిర్మించిన ఈ సినిమా లో తనికెళ్ల భరణి, అలీ, అరవింద్‌ కృష్ణ, సురేఖ వాణి, రవివర్మ లు కీలక పాత్రలో నటించారు.