జైలర్ హుకుం: కడతాడు డొక్క చించి డోలే
రెండవ సింగిల్ హుకుమ్ కి తెలుగు వెర్షన్ పాటను వెంకటేష్ ఆవిష్కరించారు. మాస్ ని ఆకట్టుకునే ఎనర్జిటిక్ ట్యూన్ తో అనిరుధ్ రవిచందర్ తన పనితనాన్ని చూపించగా.. భాస్కరభట్ల సాహిత్యం రజనీ స్వాగ్ కి అనువుగా రాశారు.
By: Tupaki Desk | 30 July 2023 6:49 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ ఆహార్యం స్టైల్ కంటెంట్ గురించి ఎంత మాట్లాడినా అది తక్కువే అవుతుంది. దశాబ్ధాలుగా గొప్ప దర్శకులు రజనీని ఆయన మ్యానరిజమ్ ని యూనిక్ గా ప్రెజెంట్ చేసేందుకు చాలానే ఆసక్తిని కనబరిచారు. నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇప్పుడు అదే చేసారు. తాజాగా జైలర్ నుండి `హుకుమ్` పాట విడుదలైంది. ఈ పాట ఆద్యంతం రజనీ స్వాగ్ పైనే చిత్రీకరించడంతో ఫ్యాన్స్ లో పూనకాలు స్టార్టయ్యాయి.
జైలర్ నుంచి తొలి సింగిల్ `కావాలయ్యా..` పాట ఇప్పటికే విడుదలై తమిళం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండవ సింగిల్ హుకుమ్ కి తెలుగు వెర్షన్ పాటను వెంకటేష్ ఆవిష్కరించారు. మాస్ ని ఆకట్టుకునే ఎనర్జిటిక్ ట్యూన్ తో అనిరుధ్ రవిచందర్ తన పనితనాన్ని చూపించగా.. భాస్కరభట్ల సాహిత్యం రజనీ స్వాగ్ కి అనువుగా రాశారు. రజనీ ఈ పాట ఆద్యంతం ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నారు. తనను ఎదురించేవాడు ఉండకూడదని హెచ్చరించే పవర్‌ఫుల్ జైలర్ గా ఆయన హుంకరింపు ధడ పుట్టిస్తోంది. ఇక హుకుమ్ పాటలో భాస్కరభట్ల పడికట్టు పదాలు థీమ్ ని ఎలివేట్ చేసాయి. `కడతాడు డొక్క చించి డోలే` అంటూ భాస్కరభట్ల ఒకే లైన్ లో రజనీ పాత్ర తీరుతెన్నులను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది.
80 వయసులోను రజనీకాంత్ లో స్పీడ్ ఎనర్జీకి ప్రతిరూపంగా ఈ పాట ఆకట్టుకుంటోంది. ఏ.ఆర్.మురుగదాస్ దర్బార్ లో రజనీ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటించారు. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ గా ఆయనని ఎలా చూపిస్తారో చూడాలన్న ఆసక్తి నెలకొంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రై.లిమిటెడ్ తెలుగులో విడుదల చేయనుంది. రజనీ సరసన తమన్నా ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.