కల్కీ 2898AD గ్లింప్స్.. ఇవి గమనించారా?
ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్
By: Tupaki Desk | 21 July 2023 4:11 AM GMTఇండియన్ మైథాలజీలో శ్రీ మహావిష్ణువు 11వ అవతారంగా కల్కి మళ్ళీ అవతరిస్తాడు. శంభల అనే ప్రాంతం నుంచి అతను వచ్చి దుష్టశక్తుల అధీనంలోకి వెళ్ళిపోయిన ఈ మానవులని తిరిగి రక్షిస్తాడు అని మన పురాణ కథలలో చదువుకున్నాం. అలాగే కల్కి పరశురాముడి దగ్గర విధ్యనభ్యసిస్తాడు. అతని నుంచి అన్నిరకాల దైవశక్తులని పొందుతాడు అని కూడా చెప్పబడింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ సృష్టించిన Kalki 2898AD మూవీ చూస్తుంటే ఇవన్ని కనిపిస్తున్నాయి.
ఇండియన్ హాలీవుడ్ మూవీగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరోగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఉండబోతోంది. ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేసి మేగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తోనే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూఎస్ లో కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ని ఆవిష్కరించారు.
ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ సినిమాని ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుందని ప్రతి ఒక్కరు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే గ్లింప్స్ లో చూపించిన కొన్ని ఎలిమెంట్స్ అయితే హిందువులకి భాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇండియన్ మైథాలజీ రిఫరెన్స్ తో తీసుకున్న ఎలిమెంట్స్ అయితే గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు.
గ్లింప్స్ వీడియో ఓపెన్ చేయడంతోనే ఓ విలన్ చేతిలో హనుమాన్ సిల్వర్ లాకెట్ ని చూపించారు. అది పట్టుకోగానే అతని చేతులు వణుకుతాయి. దాంతో హనుమాన్ పవర్ ని ఆ సీన్ తో రిప్రజెంట్ చేశారు. అలాగే పద్మకారం ఉన్న ఒక స్థలాన్ని చూపించారు. దీంతో పాటుగా ఓ గృహలో పరశురాముడు తపస్సులో ఉన్నట్లు రివీల్ చేశారు. అతని నుంచి హీరో కల్కి అందుకున్న పరుశవేది అనే ఆయుధాన్ని ఆవిష్కరించారు.
శ్రీమహా విష్ణు ఉపయోగించే సుదర్శన చక్రాన్ని రిప్రజెంట్ చేశారు. అలాగే ఓ గృహలో శివలింగాన్ని విజువల్ లో చూపించారు. పరశురాముడు జ్ఞాన యోగం నుంచి మేల్కొని నందక ఖడ్గం ప్రయోగించిన విజువల్ ఆవిష్కరించారు. ఈ అంశాలు అన్ని కూడా ఇండియన్ మైథాలజీని పూర్తిగా రెప్లికేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.
చిన్న చిన్న అంశాలే అయిన దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా పెర్ఫెక్ట్ గా మైథాలజీని స్టడీ చేసి Kalki 2898AD సినిమాని చేసాడని ఫస్ట్ గ్లింప్స్ లో ఆవిష్కరించిన ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. కచ్చితంగా ఇండియా నుంచి బెస్ట్ మూవీస్ లో ఒకటి కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.