Begin typing your search above and press return to search.

కంగువా గ్లింప్స్.. సూర్య అతి భయంకర వీరత్వం

సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   23 July 2023 4:01 AM GMT
కంగువా గ్లింప్స్.. సూర్య అతి భయంకర వీరత్వం
X

సౌత్ ఇండియాలో ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్తో విజువల్ గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన కథలను ఆవిష్కరించడానికి దర్శకులు కూడా తమ క్రియేటివిటీకి పదును పెడుతూ కొత్త సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్ గ్రాండియర్ కోసం పీరియాడిక్ జోనర్ ఫిక్షనల్, హిస్టోరికల్ కాన్సెప్ట్ లని ఎంపిక చేసుకుంటున్నారు.

తెలుగులో రాజమౌళి సృష్టించిన బాహుబలి సిరీస్ తర్వాత నిర్మాతలకి ధైర్యం వచ్చింది. కాన్సెప్ట్ బాగుంటే దేశం మొత్తం చూస్తారని డిసైడ్ అయ్యి అన్ని భాషలకి కనెక్ట్ అయ్యే స్టొరీలతో మూవీస్ చేస్తున్నారు. అలా కోలీవుడ్ లో సూర్య హీరోగా ఈ యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కంగువా మూవీ తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్ వేల్ రాజ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్నారు.

సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్పాలి. ఓ యుద్ధ క్షేత్రంలో శవాలు, చుట్టూ అలుముకున్న మంటల మధ్యలో శత్రువు ఉంటే దూరం నుంచి హీరో అగ్నితో ఉన్న బాకు విసురుతాడు. అది నేరుగా శత్రువు గుండెలు చీలుస్తుంది.

దీనిని నేరేట్ చేస్తూ పవర్ ఫుల్ డైలాగ్ ని పెట్టారు. ఈ డైలాగ్ కంపోజిషన్ కి దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించారు. ఫైనల్ గా డిఫరెంట్ లుక్ లో చేతిలో జంతువు పుర్రె ఆకారంలో ఉన్న కిరీటం పట్టుకొని, విచిత్రమైన ఆహార్యంతో సూర్య లుక్ ని రిప్రజెంట్ చేశారు. ఈ లుక్ చూస్తూ ఉంటే సూర్య ఈ సినిమాలో ఒక అటవీక సైన్యానికి నాయకత్వం వహించే వీరుడిగా ఉన్నాడు. అలాగే కథ నేపథ్యం అంతా కూడా చరిత్రలో చెప్పినట్లు కాకుండా పూర్తిగా ఆటవిక పద్దతిలో కొండలు, అడవుల మధ్యలో యుద్ధవాతావరణాన్ని సృష్టించారు. ఈ విజువల్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి క్యారెక్టరైజేషన్ లో సూర్య కనిపించడం మొదటిసారి.

అలాగే ఆడియన్స్ కూడా పీరియాడిక్ అంటే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళే కాన్సెప్ట్ లని కోరుకుంటున్నారు. అవన్నీ కూడా చిత్రంలో ఉన్నట్లు గ్లింప్స్ చూస్తూ ఉంటె తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. దిశా పటాని హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ లో కన్ఫర్మ్ చేశారు.