'బ్రో' కిల్లి కిల్లి రీమిక్స్.. పవన్ వింటేజ్ బీట్ అదిరిపోయిందహే
గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్, ఇంకా 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', 'సరిగమ పదనిస' వంటి సాంగ్స్‌ను మిక్స్ చేసి తమన్ బీట్ కొట్టినట్లు ప్రచారం సాగింది
By: Tupaki Desk | 26 July 2023 5:19 AM GMTమరి రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి కనిపించనుంది. ఆయన.. తన మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి నటించిన క్రేజీ మూవీ 'బ్రో' రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ సినిమాలో పవన్ ఫుల్ లెన్త్ రోల్ పోషించక పోయినప్పటికీ.. సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ ఉన్నంత మూవీ హై లెవల్లో ఉంటుందని ఆశపడుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని గతంలో పోస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు పవన్ వింటేజ్ సూపర్ హిట్ సాంగ్స్‌ను ఇందులో రీమేక్ చేశారని వార్తలు వచ్చాయి. గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్, ఇంకా 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', 'సరిగమ పదనిస' వంటి సాంగ్స్‌ను మిక్స్ చేసి తమన్ బీట్ కొట్టినట్లు ప్రచారం సాగింది.
అయితే ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ.. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు మేకర్స్. గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్‌ను రీమిక్స్ చేసి దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఆ సాంగ్ బీట్ అదిరిపోయింది. ముఖ్యంగా పవన్, సాయితేజ్, తమన్ కలిసి వేసిన మాస్ స్టెప్పులు పవన్ అభిమానులను ఊర్రూతలూగించేశాయి. ఈవెంట్ హాలంతా ఈలలు, గోలలతో దద్దరిల్లిపోయింది. పవన్ అయితే వింటేజ్ కూలీ లుక్‌లో లుంగీ, ఎర్రచొక్క వేసుకుని అదిరిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఈ చిత్రం నుంచి మొదట రిలీజ్ చేసిన రెండు పాటలకు అంతగా హైప్ రాలేదు.
ఆ సాంగ్స్ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలోనే రీసెంట్గా బ్రో థీమ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజై గుస్బంప్స్ తెప్పించింది. లిరిక్స్, తమన్ స్వరపరిచిన బీట్ ఊపు తెప్పించింది. అలాగే ఇప్పుడు కిల్లి కిల్లి సాంగ్ ప్రోమో ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభిమానులు ఈ ప్రోమోను చూసి ర్యాంప్ ఆడేసింది పాట అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మొత్తంగా ఈ రెండు పాటలు అప్పటివరకు సినిమాపై తక్కువగా ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశాయి. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన అవే కనపడుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ వినోదయ సీతమ్‌కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.