Begin typing your search above and press return to search.

'ఎందుకు రా బాబు'.. కిరణ్ అబ్బవరం లవ్​ ఫెయిల్యూర్​ సాంగ్​

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Aug 2023 11:53 AM GMT
ఎందుకు రా బాబు.. కిరణ్ అబ్బవరం లవ్​ ఫెయిల్యూర్​ సాంగ్​
X

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాప్ లేకుండా వరుసగా తన చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణు కథ', 'మీటర్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అదే 'రూల్స్ రంజన్'.

కిరణ్ అబ్బవరం-నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో లిరికల్ వీడియో సాంగ్ రిలీజై ఆకట్టుకుంటోంది. శ్రోతలను బాగా ఆకట్టుకునేలా ఉంది. 'ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు.. నీ చడ్డీ ఫ్రెండ్సూ ఇస్తున్నాం ఓ అడ్వైసు.. వినరా ఓ బాసు లేకుంటే నీకు లాసు..' అంటూ వచ్చే ఈ లిరిక్స్​ బాగున్నాయి. లవ్​లో ఫెయిల్ అయి బాధలో ఉన్న హీరోను, ఆ బాధలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అతడి ఫ్రెండ్స్​ పాడిన పాటగా దీన్ని చూపించారు. ఓ బార్​లో దీన్ని చిత్రీకరించారు.

కమెడియన్స్​​ వైవా హర్ష, హైపర్ ఆది, సుదర్శన్ కలిసి ఒక బార్ అండ్ రెస్టారెంట్​లో సరదాగా పాట పాడుతూనే హీరోకు పాఠం చెబుతూ, డ్యాన్స్​లు వేయడం ఆకట్టుకుంటోంది. 'లేని షూసుకి ఏడ్వొద్దు.. ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు', 'పక్క ఇంటి అంజలిలోనా ఏంజిల్ చూసేయ్ రా బ్రదరు', 'చిల్లులు పడ్డ గుండెకు ఫ్రెండ్ షిప్ ప్యాచుతో చుట్టేస్తా గ్లోబు' అంటూ సాగిన లిరిక్స్​ వినసొంపుగా ఎంతో బాగున్నాయి. సింగర్స్​ రాహుల్ సిప్లిగంజ్, రేవంత్.. అద్భుతంగా ఆలపించారు.

ఇకపోతే ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి కలిసి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్​ జరుపుకుంటోంది. అమ్రిష్ గణేష్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' సాంగ్స్​కు మంచి రెస్పాన్స్​ దక్కింది. ఇప్పుడూ మూడో సాంగ్​ కూడా బాగా ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. శిరీష్ నృత్య కొరియోగ్రఫీ చేశారు. పూర్తి స్థాయి ఫన్​ ఎంటర్​టైన్మెంట్​ చిత్రంగా ఇది రానుంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్​ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.