Begin typing your search above and press return to search.

ధోనీ నిర్మిస్తోన్న సినిమా… LGM కథ ఏంటంటే?

తాజాగా తెలుగు ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. జెర్సీలో నటించిన హరీష్ కళ్యాణ్ హీరోగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించారు.

By:  Tupaki Desk   |   18 July 2023 4:17 AM GMT
ధోనీ నిర్మిస్తోన్న సినిమా… LGM కథ ఏంటంటే?
X

ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధోని అనే పేరు ఒక బ్రాండ్. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు క్రియేట్ చేసుకున్న జార్ఖండ్ డైనమైట్. ధోని ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. తన మొదటి చిత్రాన్ని తమిళంలో లో బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ధోని తన భార్య సాక్షి కోరిక మేరకు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే LGM మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తూ ఉంటే తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. జెర్సీలో నటించిన హరీష్ కళ్యాణ్ హీరోగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించారు.

ఇక ట్రైలర్ లోకి వెళ్తే హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. అయితే హీరో తన మదర్ తో కలిసి ఉంటాడు. పెళ్లి తర్వాత కూడా అమ్మ మనతోనే ఉంటుందని హీరోయిన్ కి చెబుతాడు. అది హీరోయిన్ కి ఇష్టం ఉండదు. తనతో కలిసి ఉండేవారి గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలని హీరోయిన్ అనుకుంటుంది. దీంతో ఒక ప్లాన్ చేసి ఇద్దరి ఫ్యామిలీస్ తో కలిసి ట్రిప్ కి వెళ్తారు.

అలా ఫారెస్ట్ లోకి ట్రిప్ కి వెళ్ళిన వారిలో హీరోయిన్, హీరో, తల్లిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఒక పులి బోనులో వారిని బంధించి తీసుకొని వెళ్తారు. తరువాత ఏం జరిగింది అనేది కథలో భాగంగా ఉంది. లెట్స్ గెట్ మ్యారీడ్ అనే మీనింగ్ తో ఎల్జీఎం టైటిల్ ఈ చిత్రానికి పెట్టినట్లు తెలుస్తోంది. కంప్లీట్ ఫ్రెష్ కంటెంట్ తో ఈ మూవీని రమేష్ తమిలమని తెరకెక్కించారు.

ధోని ఎంటర్టైన్మెంట్స్ నుంచి మొదటి చిత్రంగా వస్తోన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇలాంటి ఫ్రెష్ ఫీల్ ఇచ్చే కంటెంట్ లని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ఇప్పటికే లవ్ టుడే అలాంటి ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎల్జీఎంపైన అంచనాలు పెరిగాయి.