ట్రైలర్ టాక్.. ఈ ప్రేమ్ కుమార్ కి పెళ్లి అయ్యేనా..
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకడు.
By: Tupaki Desk | 18 July 2023 1:20 PM GMTటాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకడు. గోల్కొండ హై స్కూల్ సినిమాలో చిన్న పిల్లాడిలా కనిపించిన సంతోష్, ఆ తర్వాత హీరోగా అడుగులు వేడయం మొదలుపెట్టాడు. పేపర్ బాయ్ సినిమాతో పూర్తి స్తాయి హీరోగా మారిన సంతోష్, అప్పటి నుంచి వరస అవకాశాలు అందిపుచ్చకొని ముందుకు దూసుకుపోతున్నాడు.
సంతోష్ లోని టాలెంట్ ని గుర్తుంచి డైరెక్టర్లు మంచి ఛాన్సులు ఇస్తున్నప్పటికీ, మంచి కమర్షియల్ హిట్ మాత్రం పడలేదనే చెప్పాలి. కథలోనో, లేదంటే కథనంలో లోపం కారణంగానో, ఎక్కడో సినిమాలు తడపడుతున్నాయి. అందుకే, ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ పడలేదు. ఇటీవల అన్నీ మంచి శకునములే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటానని అనుకున్నాడు. కానీ, ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
అయితే, ఆయన మరోసారి గట్టిగా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా, ప్రేమ్ కుమార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు.
రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా.. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక, మూవీ ట్రైలర్ విషయానికి వస్తే, సంతోష్ శోభన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అందులో అతను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ, పాపం తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా, ఏదో ఒక విధంగా పెళ్లి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది.
చివరకు పెళ్లి అనేది వదిలేసి, ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తన బిజినెస్ క్లిక్ అయ్యిందా? అతనికి జీవితంలో పెళ్లి జరుగుతుందా? అతని జీవితానికి హీరోయిన్లకు ఏంటి సంబంధం? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ఈ మూవీ తో అయినా, సంతోష్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.