Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బామ్మర్ది మ్యాడ్ సింగిల్ యాంథమ్..!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2023 9:06 AM GMT
ఎన్టీఆర్ బామ్మర్ది మ్యాడ్ సింగిల్ యాంథమ్..!
X

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ ట్రైనర్ మ్యాడ్. కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో నార్నే నితిన్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. కాగా, ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, తాజాగా, ఈ మూవీ నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. సింగిల్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా సింగిల్ యాంథమ్ విడుదల చేశారు. ‘ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్’ అంటూ ఈ పాట సాగింది. ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా, సింగిల్ గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. పాట వింటుంటూనే ఊపచ్చి డ్యాన్స్ వేసేలా ఉండటం విశేషం.

ఈ సినిమాకు హారిక సూర్యదేవర నిర్మాతగా వ్యవహిరించనున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె ఈ హారిక సూర్యదేవర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సహకారంతో, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌కు చెందిన సాయి సౌజన్య కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీలో హీరోయిన్లను కూడా చాలా కొత్తవారిని తీసుకున్నారు. గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక అనే ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షామ్ దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

ఈ సినిమా మొత్తం కాలేజీ బ్యాగ్రౌండ్ లో జరుగుతుంది. సినిమా షూటింగ్ కూడా మొత్తం నిజంగా కాలేజీలోనే చేశారట. సీన్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయని. ఫుల్ కామెడీ జోనర్ లో సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడతామని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. మరి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.