Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న.. సమయంలో నాని జర్నీ!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. చివరగా దసరా మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 7:07 AM GMT
హాయ్ నాన్న.. సమయంలో నాని జర్నీ!
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. చివరగా దసరా మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో ఫుల్ గడ్డం, జుట్టుతో మాస్ గా కనిపించారు. డైలాగులు కూడా అంతే మాస్ గా చెప్పారు. అయితే, ఇప్పుడు హాయ్ నాన్నలో దసరా మూవీ తో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. లుక్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి కొన్ని వీడియోలు విడుదల చేశారు.

మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో దగ్గర నుంచి అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మూవీ పై విపరీతమైన క్రేజ్ పెంచాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నామని మూవీ టీమ్ ప్రకటించింది. ఆ తర్వాత చిన్న ప్రోమో విడుదల చేశారు. ఇక, ఈ రోజు ఈ పాట విడుదల చేశారు. హాయ్ నాన్న నుంచి సమయమా పాట లిరికల్ వీడియో విడుదల చేశారు.

పాట వినడానికి చాలా శ్రావ్యంగా ఉంది. లిరిక్స్ చాలా చక్కగా రాశారు. పాట విన్న కొద్దీ మళ్లీ వినాలి అనే అనుభూతి కలిగిస్తోంది. ఇక, లిరికల్ వీడియో అయినా, నాని, మృణాల్ లుక్ స్పష్టంగా కనపడుతోంది. ఇద్దరూ చాలా అందంగా కనపడుతున్నారు. ఇక,గతంలో ఈ మూవీ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. మృణాల్ ఈ మూవీలో నానికి కూతురు గా నటిస్తోంది అంటూ ప్రచారం చేశారు. కానీ, ఈ వీడియో చూసిన తర్వాత అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా నాని 30వ చిత్రం. నాని, మృణాల్ జంట చూడటానికి బాగుంది. అది కూడా ఈ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ఇది.

ఇక, ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా, హాయ్ నాన్న తర్వాత ఆయన మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం రుగుతోంది. . మృణాల్ ఠాకూర్ కి కూడా రెండు, మూడు సినిమాల్లో ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరి సీతారామం తర్వాత వస్తున్న ఈ సినిమాతో మృణాల్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.