ఎగిరే మనసే: డబ్బింగు పాటలోను బోస్ మ్యాజిక్!
ఇది డబ్బింగు పాట అని గుర్తు చేసే కొన్ని పదాలు మినహాయిస్తే, టైగర్ 3 లాంటి సినిమాలో పాటల విజువల్ రిచ్ నెస్ గ్రాండియారిటీ గురించి వేలెత్తి చూపలేం.
By: Tupaki Desk | 23 Oct 2023 6:42 AM GMTఇది డబ్బింగు పాట అని గుర్తు చేసే కొన్ని పదాలు మినహాయిస్తే, టైగర్ 3 లాంటి సినిమాలో పాటల విజువల్ రిచ్ నెస్ గ్రాండియారిటీ గురించి వేలెత్తి చూపలేం. కోట్లాది రూపాయలు వెచ్చించి అందమైన లొకేషన్లలో విజువల్ రిచ్ గా సాంగ్ తీయడం చాలా రొటీన్. ఇప్పుడు సల్మాన్ భాయ్- కత్రిన కైఫ్ జంటపై తెరకెక్కించిన ఈ పాట అంతే విజువల్ రిచ్ యాంబియెన్స్ తో మతులు చెడగొడుతోంది. కత్రిన ఎప్పటిలానే చిట్టి పొట్టి నిక్కర్లు, బికినీ తరహా డ్రెస్సుల్లో చెలరేగిపోగా, సల్మాన్ భాయ్ తనవైన సిగ్నేచర్ మార్క్ స్టెప్పులతో ఊప్ తెచ్చాడు.
ఎగిరే మనసే.. అంటూ భాయ్ రోమాంచితమైన గీతానికి పరవశించి ఆడుతున్న కత్రినను చూడగానే కుర్రకారు గుండెలు జివ్వుమనడం ఖాయం. టైగర్ 3లో ఫుల్ యాక్షన్ కి మాత్రమే కాదు రొమాన్స్ కి కూడా స్కోప్ ఉంది. టెర్రరిస్టులపై అంతం లేని అరాచకుడిగా విరుచుకుపడే భాయ్ లో రొమాంటిక్ యాంగిల్, కామిక్ టైమింగ్ కూడా మాస్ ఆడియెన్ ని మెప్పించేందుకు ఆస్కారం ఉంది.
ఆసక్తికరంగా ఈ పాటను రాసింది ఎవరు? అంటే.. ఆస్కార్ ని తెలుగు లోగిళ్లలోకి తెచ్చిన, భారతదేశం గర్వించదగిన లిరిసిస్ట్ చంద్రబోస్ రాసారు. బెన్నిదయాల్, అనూష ఆలపించారు. ప్రీతమ్ లాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ పెప్పీ ట్యూన్ తో మైమరిపించారు. ఎగిరే మనసు.. అంటూ ఘాడమైన లోతైన అర్థం ఉన్న రోమాంచిత పదంతో పాట ఎత్తుగడను ప్రారంభించిన చంద్రబోస్ తనవైన లిరికల్ వర్డింగ్ తో చాలా మ్యాజిక్ చేసాడు. అందుకే ఈ పాట డబ్బింగ్ పాట అయినా కానీ వినసొంపైన స్వరంలో సాహిత్యం అలరిస్తుంది. ట్యూన్ కి తగ్గట్టే సాహిత్యాన్ని సృజించాలి కాబట్టి బోస్ కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏదేమైనా ఇది విజువల్ గా సూపర్ హిట్ గీతం అని ప్రశంసించడం తప్పేమీ కాదు.