Begin typing your search above and press return to search.
తిరుపతిలో గెలుపుపై జగన్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 19 March 2021 2:30 PM GMTపంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలు అందుకున్న సీఎం జగన్ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై పడ్డారు. ఏపీలో వచ్చేనెల 17న జరిగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ముందే వైసీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీలోని ప్రధాన పార్టీలు తిరుపతి గెలుపు కోసం వ్యూహరచనలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వైసీపీ నేతలతో ఇవాళ సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికపై నేతలతో చర్చించారు.
తిరుపతి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని జగన్ ఎంపిక చేశారు. ఆయనను ఇవాళ సీఎం జగన్ పార్టీ నేతలకు పరిచయం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి వైసీపీని గెలిపించాలని.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నేతలను ఆదేశించారు.ఇందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
తిరుపతిలోని ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని నేతలకు జగన్ సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే ఒరవడి కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని తెలిపారు.ప్రతీ ఓటరుకూ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరించాలని నేతలకు జగన్ సూచించారు. అతివిశ్వాసానికి వెళ్లొద్దని జగన్ కోరారు. గురుమూర్తిని నేతలంతా సమన్వయంతో గెలిపించాలని ఆదేశించారు.