Begin typing your search above and press return to search.
గుడికెళితే ‘పొత్తేంది’ స్వామి?
By: Tupaki Desk | 4 Feb 2016 6:15 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ నిత్యం మీడియాలో ఉండే బీజేసీ నేత.. తమిళనాడుకు చెందిన సుబ్రమణ్య స్వామి తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. అయితే.. ఆయన వ్యాఖ్య వాస్తవరూపం దాల్చే అవకాశం తక్కువగా ఉందని పలువురు కొట్టిపారేస్తున్నా.. రాజకీయాల్లో ఏమైనా జరుగుతుందన్న దానికి.. స్వామి వ్యాఖ్య ఒక విత్తనంగా మారే ఛాన్స్ ను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. స్వామి చేసిన తాజా వ్యాఖ్య కానీ వాస్తవరూపం దాలిస్తే.. తమిళనాట రాజకీయాల్లో పెనుమార్పులు పక్కా అంటున్నారు.
ఆయన అన్నంత ఈజీగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేనప్పటికీ.. ఒక ఆప్షన్ గా స్వామి వ్యాఖ్యలు పనికి వస్తాయని చెప్పొచ్చు. ఇంతకీ.. స్వామి చేసిన వ్యాఖ్య ఏమిటంటే.. డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ గుడికి వెళుతున్నారని.. కరుణకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో డీఎంకే పగ్గాల్సి స్టాలిన్ కు అప్పజెబితే.. బీజేపీతో పొత్తుకు అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలతో కలిపి డీఎంకే.. బీజేపీలు ఒక కూటమిగా ఏర్పడిన పక్షంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటం కష్టం కాదని.. అధికార అన్నాడీఎంకేను రాజకీయంగా దెబ్బ తీయొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మొత్తం ఇస్యూకు స్టాలిన్ కు గుడికి వెళ్లే అలవాటు ఉండటం చూస్తే.. గుడికి వెళ్లే అలవాటు రాజకీయంగా ఇంత మార్పునకు అవకాశం ఇస్తుందా? అనిపించక మానదు. మిగిలిన అన్నీ ఓకే అయినా.. డీఎంకే పగ్గాల్ని కరుణానిధి వదిలి.. కొడుక్కి ఇచ్చే అవకాశం ఉందా? అన్నదే పెద్ద ప్రశ్న.