Begin typing your search above and press return to search.
బాలయ్యను అడ్డుకున్న మహిళలు
By: Tupaki Desk | 15 Aug 2015 6:12 AM GMTసినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తాను ప్రాథినిత్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం పట్టణంలో ఆయన రహదారి నిర్మాణ భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పలువురు మహిళలు బాలయ్యను చుట్టుముట్టి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కరువు కాటకాలతో విలవిల్లాడుతున్నాం...ఉపాధి లేక పిల్లలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వసలపోతున్నాం తమకు ఉపాధి కల్పించాలని..ఈ విషయంలో ప్రభుత్వం తమను అస్సలు పట్టించుకోవడం లేదని బాలయ్యకు తెలిపారు. ఈ విషయంలో తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా వారు బాలయ్యను డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వారందరు ప్రశ్నలు వేయడంతో కాస్త తడబాటుకు గురైన ఆయన తేరుకుని రెండు నెలల్లో మీకందరికి ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అయితే అప్పటకీ ఉపాధి పనులు ఆగిపోతాయని తర్వాత తమకు ఉపాధి ఎలా ఇస్తారని వారు వాపోయారు.
ఇదిలా ఉంటే గతంలో కూడా బాలయ్య హిందూపురంలో పర్యటించినప్పుడు అక్కడ పలువురు ఉపాధి లేక కర్ణాటకకు వలస వెళుతున్నామని..తమకు ఇక్కడే ఉపాధి కల్పించాలని కోరారు. వెంటనే బాలయ్య విప్రో కంపెనీ సబ్బుల తయారీ ప్రాజెక్టుతో పాటు చిన్న తరహా పరిశ్రమలను అక్కడ వచ్చేందుకు కృషి చేశారు. వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న హిందూపురంలో ఈ కంపెనీలు ఏర్పాటైతే నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి దొరికినట్లవుతుంది.