చైనా వాళ్లు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు కానీ.. వైద్యం విషయంలో వారి ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో లేవని అంటుంటారు. ఖర్చు తక్కువ అని చైనాకెళ్లి ఎంబీబీఎస్ చదివి వచ్చే మనవాళ్లను చిన్నచూపు కూడా చూస్తుంటారు ఇండియాలో. ఐతే ప్రపంచమంతా నివ్వెరబోయే ఓ అద్భుతమైన సర్జరీ చేసి చైనా వైద్యులు ఓ చిన్నారి ప్రాణాల్ని నిలబెట్టారు. అమెరికన్ డాక్టర్స్ కు కూడా ఈ సర్జరీ చేసిన విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఏంటా సర్జరీ.. దాన్నెలా చేశారు.. తెలుసుకుందాం పదండి.
చైనాకు చెందిన ఓ చిన్నారి తల చిన్నప్పటి నుంచి అసాధారణంగా పెరుగుతూ వస్తోంది. మూడేళ్ల వయసు వచ్చేసరికి ఉండాల్సినదానికంటే నాలుగు రెట్లు పెద్దదిగా తయారైంది తల. ఇంకొన్ని రోజులు పోతే ఆ పాప ప్రాణాలు నిలవడం ఖాయమని తేల్చారు వైద్యులు. ఓ అరుదైన వ్యాధి వల్ల పాప పరిస్థితి అలా తయారైందని.. ఓ సంక్లిష్టమైన సర్జరీ చేయాల్సి ఉంటుందని చైనాకు చెందిన ప్రముఖ వైద్యులు నిర్ణయించారు. ఐతే ఈ సర్జరీ కోసం మరో దేశానికి వెళ్లకుండా.. తామే ఆ సవాల్ స్వీకరించాలని హనన్ ప్రావిన్స్ కు చెందిన ఓ హాస్పిటల్ వైద్యులు నిర్ణయించుకున్నారు.
త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా పుర్రెను కొత్తగా పునర్నిర్మించి.. సర్జరీ ద్వారా పాపకు అమర్చారు వైద్యులు. భారీ సంఖ్యలో వైద్య నిపుణుల బృందం 17 గంటల పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే ఆ పాప అందరిలా లేచి తిరుగుతుందని.. ఆరోగ్యంగా జీవిస్తుందని అంటున్నారు వైద్యులు. చైనా వైద్య చరిత్రలో ఇదో అద్భుతమైన సర్జరీగా చెప్పుకుంటున్నారు.