కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్.. అసలేమైంది?
అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమయ్యారు.;
అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమయ్యారు.
వర్జీనియాలో నివాసం ఉండే సుదీక్ష మార్చి 6న మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వెకేషన్ కోసం డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్యూంటా కానా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రియూ రిపబ్లికా రిసార్ట్ సమీపంలోని బీచ్ వద్ద నడుచుకుంటూ కనిపించిన ఆమె, ఆ తరువాత అదృశ్యమైంది.
ఆమె కనిపించకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. గత నాలుగు రోజులుగా డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఆమె కోసం శోధిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు. సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సుదీక్ష తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారిగా అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.