అమెరికాలో ఘోర ప్రమాదం.. కోమాలో ఇండియన్ స్టూడెంట్.. ఎంపీ రిక్వస్ట్!
అమెరికాలో ఫిబ్రవరి 14న నీలం షిండే అనే భారతీయ విద్యార్థిని కారు ప్రమదానికి గురైంది. ఈ సమయంలో ప్రమాదం చేసిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.
అమెరికాలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో భారతీయ విద్యార్థులు తీవ్రంగా గాయపడటం, మృత్యువాత పడటం వంటి ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 14న భారతీయ విద్యార్థిని నీలం షిండే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ఐసీయూలో ఉందని అంటున్నారు.
దీంతో... ఈ పరిణామంపై లోక్ సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా... తమ కుమార్తెను చూసేందుకు తల్లితండ్రులకు ఎమర్జెన్సీ వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నీలం షిండేది మహారాష్ట్ర్లోని సతార జిల్లా కాగా.. అమెరికాలో ఉన్నతవిధ్యను అభ్యసిస్తున్నారని అంటున్నారు.
అవును... అమెరికాలో ఫిబ్రవరి 14న నీలం షిండే అనే భారతీయ విద్యార్థిని కారు ప్రమదానికి గురైంది. ఈ సమయంలో ప్రమాదం చేసిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయంపై స్పందించిన నీలం తండ్రి తానాజీ షిండే.. తమ కుమార్తెకు ప్రమాదం జరిగిందనే విషయం తమకు ఫిబ్రవరి 16న తెలిసిందని పేర్కొన్నారు.
దీంతో.. నాటి నుంచి అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఇప్పటివరకూ తమకు వీసా రాలేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్ .సీ.పీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలె స్పందించి.. వీసా కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే... కారు ప్రమాదంలో నీలం షిండే తీవ్రంగా గాయపడ్డారని.. ఇందులో భాగంగా ఆమె కాళ్లు, చేతులు విరిగిపోయాయని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఆమె తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె మెదడుకు ఆపరేషన్ చేసేందుకు ఆస్పత్రి వర్గాలు కుటుంబం అనుమతి కోరినట్లు చెబుతున్నారు.
కాగా మాస్టర్ ఆఫ్ సైన్స్ విద్యార్థిని అయిన షిండే.. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చివరి సంవత్సరం చదువుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ప్రతీ రోజు తమకు సమాచారం అందిస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.