అమీర్ ఖాన్ వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ ఆధిపత్యం

డార్లింగ్ ప్ర‌భాస్ నేడు భార‌త‌దేశంలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ పాన్ ఇండియ‌న్ స్టార్. అత‌డు హీరోగా న‌టిస్తే చాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ 1000 కోట్లు సునాయాసంగా ద‌క్కుతున్నాయి.

Update: 2025-02-02 19:30 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ నేడు భార‌త‌దేశంలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ పాన్ ఇండియ‌న్ స్టార్. అత‌డు హీరోగా న‌టిస్తే చాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ 1000 కోట్లు సునాయాసంగా ద‌క్కుతున్నాయి. బాహుబ‌లి ఫ్రాంఛైజీతో 2200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన ప్ర‌భాస్, ఆ త‌ర్వాత స‌లార్ చిత్రంతో 800 కోట్లు, క‌ల్కి 2898 ఏడి చిత్రంతో 1200 కోట్లు తెచ్చాడు. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాతా అత‌డు బ్యాక్ టు బ్యాక్ స‌లార్, క‌ల్కి చిత్రాల‌తో కంబ్యాక్ అయ్యాడు. కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో య‌ష్‌, పుష్ప ఫ్రాంఛైజీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 1000 కోట్ల క్ల‌బ్ రేసులోకి వ‌చ్చారు.

అదంతా అటుంచితే బాక్సాఫీస్ రేసులోకి ప్ర‌భాస్ రాక మునుపే ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ హీరో భార‌త‌దేశంలో ఆల్ టైమ్ అతిపెద్ద బాక్సాఫీస్ లెజెండ్ గా కొన‌సాగారు. 2009లో అందరూ 200 కోట్ల గ్రాస్ కోసం కష్టపడుతున్నప్పుడు 400 కోట్ల గ్రాస్ ఇచ్చారు. ఇది 3 ఇడియ‌ట్స్ తో సాధ్య‌మైంది. 2013 లో అందరూ 400 కోట్ల గ్రాస్ కోసం కష్టపడుతున్నప్పుడు 550 కోట్ల గ్రాస్ ఇచ్చారు. ధూమ్ 3తో ఈ ఫీట్ సాధ్య‌మైంది. 2014 లో అందరూ 500 కోట్ల గ్రాస్ కోసం కష్టపడుతున్నప్పుడు 750 కోట్ల గ్రాస్ ఇచ్చారు. పీకే చిత్రంతో ఇది సాధించాడు అమీర్.

2016 లో అందరూ 1000 కోట్ల గ్రాస్ కోసం కష్టపడుతున్నప్పుడు 2000 కోట్ల గ్రాస్ ఇచ్చారు. క్రీడా నేప‌థ్య చిత్రం దంగ‌ల్‌తో ఈ ఫీట్ సాధ్య‌మైంది. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్, సీక్రెట్ స్టార్ చిత్రాలు చైనాలో విదుద‌లై సంచ‌ల‌న విజయాలు సాధించాయి. భారతదేశంలో అన్ని కాలాలలో అతిపెద్ద బాక్సాఫీస్ లెజెండ్ అని అమీర్ ఖాన్ త‌న అసాధార‌ణ రికార్డుల‌తో నిరూపించారు. అందుకే ఆయన గ‌త కొంత‌కాలంగా స్ట్ర‌గుల్స్ లో ఉన్నా కానీ దాని ప్ర‌భావం అత‌డిపై ప‌డ‌లేదు. త‌దుప‌రి తారే జ‌మీన్ ప‌ర్ సీక్వెల్ `సితారే జ‌మీన్ పార్`లో అమీర్ ఖాన్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా కూడా దేశ విదేశాల్లో విడుద‌లై మంచి వ‌సూళ్లను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం ష‌ష్ఠిపూర్తి వ‌య‌సులో ఉన్నాడు. అత‌డు 60ల‌లో ఉండ‌గా 40ల‌లో ఉన్న ప్ర‌భాస్, అల్లు అర్జున్, య‌ష్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లాంటి హీరోలు బాక్సాఫీస్ వార్ లోకి దూసుకొచ్చారు. 1000 కోట్ల క్ల‌బ్‌ల‌తో స‌త్తా చాటుతున్నారు. మునుముందు మ‌రో 10-20 సంవత్స‌రాల పాటు ఈ హీరోలు ఈ దూకుడును కొన‌సాగించే వీలుంది.

Tags:    

Similar News