పుష్ప 2 లో లేకున్నా బాధగా లేదు...!
ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమాలో కూడా కనిపిస్తున్న నటుడు అజయ్ ఘోష్
ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమాలో కూడా కనిపిస్తున్న నటుడు అజయ్ ఘోష్. అత్యంత కిరాతకంగా కనిపించడంతో పాటు, చాలా ఫన్నీ పాత్రల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు అజయ్ ఘోష్.
ఈయన ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మొదటి సారి లీడ్ రోల్ లో నటించిన అజయ్ ఘోస్ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చాడు. తాజాగా ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పుష్ప సినిమా తో అజయ్ ఘోష్ కి మంచి గుర్తింపు లభించింది. అలాంటి పుష్ప సినిమా సీక్వెల్ లో అజయ్ ఘోష్ పాత్ర ఉండక పోవడం పట్ల ఆయన అభిమానులు కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ ఘోష్ తాజా ఇంటర్వ్యూలో పుష్ప 2 లో తాను లేక పోవడం పట్ల స్పందించాడు.
కరోనా సమయంలో నా కెరీర్ ఖతం అయ్యింది అనుకుంటున్న సమయంలో సుకుమార్ గారు అరగంట నాతో మాట్లాడి నన్ను మోటివేట్ చేసి నాతో పుష్ప లో కొండా రెడ్డి పాత్ర ను చేయించారు. ఆ పాత్ర నాకు నిజంగా పునర్జీవనం వంటిది అన్నాడు.
పుష్ప 2 లో నా పాత్ర లేదు, నేను నటించలేక పోయాను అనే బాధ లేదు. ఎందుకంటే పుష్ప 2 గురించి మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు కూడా పుష్ప గురించి మాట్లాడాల్సిందే. పుష్ప 2 లో నేను లేకున్నా కూడా పుష్ప ప్రస్తావన వచ్చినప్పుడు కొండారెడ్డి పాత్ర లో నటించిన నా గురించి ప్రస్థావన వస్తుంది అన్నాడు.
ప్రస్తుతం పలు సినిమాలతో పాటు రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. మొత్తానికి అజయ్ ఘోష్ చేతిలో ప్రస్తుతం పది పదిహేను సినిమాలు ఉన్నాయి.