బాలయ్య కోసం మళ్లీ ఆబ్యూటీని దించుతున్నారా?
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మద్య `అఖండ-2 శివతాండవం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మద్య `అఖండ-2 శివతాండవం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యకు జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోం ది. బాలయ్య తోపాటు ఆమెకూడా షూటింగ్ లో పాల్గొంటుంది. షూట్ మొదలైన నాటి నుంచి చాలా సన్ని వేశాల్లో సంయుక్తా కూడా భాగమైంది. తాజాగా ఇదే సినిమా కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్ కి కూడా రంగంలోకి దించుతున్నారు.
ఓ కీలక పాత్ర కోసం విద్యాబాలన్ ని అప్రోచ్ అయినట్లు తెలిసింది. ఆమె కూడా ఒకే చెప్పటినట్లు సమాచారం. దీంతో సినిమా స్పాన్ ఇంకా పెరుగుతుంది. విద్యాబాలన్ అంటే బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్. సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నటి. అలాంటి నటి భాగమైతే హిందీ మార్కెట్ లో మరింత కలిసొస్తుంది. విద్యాబాలన్ తో నటించడం బాలయ్యకిది రెండవసారి అవుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ రాజకీయ నాయకురాలి పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రతో తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కొన సాగలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత విద్యాబాలన్ బాలయ్య సినిమాతోనే కంబ్యాక్ అవ్వడం విశేషం. విద్యాబాలన్ టాలీవుడ్ సీనియర్ హీరోలకు బాగా సెట్ అవుతుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య వయసులకు సరిపోతుంది.
వీళ్లంతా కూడా 60లు దాటిన హీరోలే. విద్యాబాలన్ 45. అలా చూసుకుంటే ఇద్దరి మద్య 15 ఏళ్లు వ్యత్యాసం ఉంటుంది. కానీ టాలీవుడ్ మేకర్స్ సహా హీరోలు 40 లోపు ఉన్న భామల్నే తీసుకుంటున్నారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి157వ సినిమా చేస్తున్నారు. ఇందులో ఒక నాయికగా అతిదీ రావు హైదరీని తీసుకుంటున్నారు. మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది. ఇంకా ఆ స్థానంలో ఎవరూ ఫైనల్ కాలేదు. `అఖండ2` లో గనుక ఎంపికైతే చిరంజీవి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.