తప్పుగా మాట్లాడినా రైట్ అయిపోతుందా!
తాజాగా 'కేసరి చాప్టర్ 2' ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ జయాబచ్చన్ వ్యాఖ్యలపై స్పందించాడు.;

ఇటీవలే 'టాయిలెట్ ఏక్ ప్రేమ కథ' టైటిల్ పై జయాబచ్చన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ తనకే మాత్రం నచ్చలేదని...ఆ టైటిల్ చూడండి ఎలా ఉందో అంటూ కించపరిచేలా మాట్లాడారు. నిజంగా అది సినిమా టైటిలా? దాన్ని టైటిల్ అంటారా? అలాంటి టైటిల్స్ ఉన్న సినిమాలు చూడనని అసహనాన్ని వ్యక్తం చేసారు. దీంతో టాయిలెట్ ఏక్ ప్రేమ కథ నిర్మాత నిర్మాత ప్రేరణా అరోరా జయాబచ్చన్ వ్యాఖ్యలపై అంతే మండిపడ్డారు.
ఆ సినిమాకు ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాం? రిలీజ్ తర్వాత ఇచ్చిన సందేశం... సాధించిన వసూళ్లు చూసి మాట్లాడండి మేడం అంటూ ఎటాక్ చేసారు. కానీ అందులో నటించిన అక్షయ్ కుమార్ మాత్రం ఆ సందర్భంలో స్పందించలేదు. తాజాగా 'కేసరి చాప్టర్ 2' ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ జయాబచ్చన్ వ్యాఖ్యలపై స్పందించాడు. 'టాయిలెట్ ఏక్ ప్రేమ కథ గురించి అమె ఏం మాట్లాడారో నాకు తెలియదు.
కానీ ఆమె ఏం మాట్లాడిన సరైందే' అంటూ స్పందించారు. దీంతో అక్షయ్ కుమార్ పెద్దావిడపై సెటైర్ వేసాడా? లేక ఆమెను సమర్ధిస్తున్నాడా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. అయితే ఇది జయాబచ్చన్ పై అక్షయ్ వేసిన సెటైరికల్ పంచ్ అంటూ అక్షయ్ అభిమానులు కొంత మంది పోస్టులు పెడుతున్నారు. జయాబచ్చన్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ అక్షయ్ కుమార్ ఆమె వ్యాఖ్యల్ని సమర్శించినా తప్పుగా మాట్లాడిన మాటలు రైట్ అయిపోతాయా? వాటిని సమాజాం అంగీకరిస్తుందా? అంటూ పోస్టులు పెడుతున్నారు. అక్షయ్ కుమార్ కామ్ గోయింగ్ పర్సన్ అని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కరణ్ సింగ్ తెరకెక్కించిన 'కేసరి చాప్టర్ 2' ఈనెల 18న ప్రేక్షకుల ముందకొస్తుంది.